రాష్ట్ర బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ కార్యదర్శిగా కొంకిమళ్ళ మల్లికార్జున రావు

ఇకపై రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు మరింత పెరిగాయని వ్యాపారుల సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు

Apr 26, 2023 - 09:04
 0
రాష్ట్ర బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ కార్యదర్శిగా కొంకిమళ్ళ మల్లికార్జున రావు

మనభారత్ న్యూస్, 26 ఏప్రిల్ 2023, జగ్గయ్యపేట : రాష్ట్ర బంగారు, వెండి, డైమండ్ మర్చంట్స్ అసోసియేషన్ కార్యదర్శిగా జగ్గయ్యపేటకు చెందిన షరాబు వర్తక సంఘం ప్రధాన కార్యదర్శి కొంకిమళ్ళ మల్లికార్జునరావు (మల్లు)ను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు. ఐదేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతూ రాష్ట్ర అసోసియేషన్ పటిష్టానికి కృషి చేయాలని ఆయన నియామక పత్రంలో కోరారు.‌ జగ్గయ్యపేట సంఘం ప్రధాన కార్యదర్శిగా రెండున్నర దశాబ్దాలుగా పనిచేస్తూ జగ్గయ్యపేట పట్టణ ప్రాంత వ్యాపారులకు అండగా నిలుస్తూ, వారి సమస్యల పరిష్కారం లో కీలకపాత్ర పోషిస్తున్న మల్లికార్జున రావు సేవలను గుర్తించిన రాష్ట్ర కమిటీ ఈ నియామకం చేపట్టింది. రాష్ట్ర అసోసియేషన్ కార్యదర్శిగా నియమితులైన మల్లికార్జునరావును మాజీ మున్సిపల్ చైర్మన్, సంఘం అధ్యక్షులు శ్రీరాం సుబ్బారావు, గౌరవాధ్యక్షులు శ్రీరాం రామకృష్ణ, కోశాధికారి యర్రం శివప్రసాద్, ఉపాధ్యక్షులు కొత్తమాసు మల్లికార్జునరావు, జేఆర్సీ విద్యాసంస్థల చైర్మన్ రంగాపురం నరసింహారావు, శ్రీరాం సీతా రామమూర్తి తదితరులు అభినందించారు. జగ్గయ్యపేటలో వ్యాపారుల సమస్యలపై సమగ్ర అవగాహన కలిగి వాటి పరిష్కారానికి విశేషంగా కృషి చేస్తున్న మల్లికార్జున రావు సేవలను రాష్ట్రస్థాయిలో వినియోగించు కోవాలనుకోవడం ఆనందంగా ఉందని వారు హర్షం వ్యక్తం చేశారు. జగ్గయ్యపేట పట్టణ బంగారం,వెండి వ్యాపారులు, స్వర్ణకారులు పలువురు మల్లికార్జున రావుకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మల్లికార్జున రావు మాట్లాడుతూ జగ్గయ్యపేట షరాబు వర్తక సంఘం వ్యాపారులు అందించిన సహకారం, సంఘం పెద్దలు శ్రీరాం సుబ్బారావు శ్రీరాం రామకృష్ణ, శ్రీరాం సీతారామమూర్తి కొత్తమాసు మల్లికార్జున రావు, యర్రం శివప్రసాద్, జంగాల నాగరాజు తదితరులు అందించిన ప్రోత్సాహంతోనే సుదీర్ఘకాలం బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చానని, ఇకపై రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు మరింత పెరిగాయని వ్యాపారుల సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

admin ManaBharat News