దేశ అభివృద్ధిలో మీడియా ప్రాధాన్యత
మనభారత్ న్యూస్, 26 ఏప్రిల్ 2023 : మీడియా ప్రాధాన్యత
"మీడియా" లేకపోతే జిల్లా కలెక్టర్ ఏం చేస్తున్నాడు ఎవరికి తెలియదు..
"ప్రెస్ కవరేజ్" లేకపోతే పోలీసులు ఎవరు ఎక్కడ డ్యూటీ చేస్తున్నారు అనేది కూడా ఎవరికీ తెలియదు..
"ప్రెస్ కవరేజ్" లేకపోతే ఏ ఎమ్మెల్యే మంత్రి ఎక్కడెక్కడ ఏమి చేస్తున్నాడో....... అనేది కూడా ఎవరికీ తెలియదు..
జిల్లా అధికారులను
పోలీస్ సిబ్బందిని
పోలీస్ అధికారులను
ఇటు ప్రజలను
అటు ప్రభుత్వాలను
నిరంతరం పర్యవేక్షిస్తూ
వారి వారి డ్యూటీ విధానాలను సక్రమంగా నిర్వహిస్తూ ఉన్నారా లేదా అని నిరంతరం ప్రెస్ కవరేజీ తో ప్రజలకు వారధిలా పనిచేస్తుంది జర్నలిస్టులే అనడంలో అతిశయోక్తి లేదు..
జర్నలిస్టులు నిరంతరం శ్రమిస్తూ అటు ప్రభుత్వాల పనితీరును, జిల్లా అధికారుల పనితీరును, పోలీసు వారి పనితీరును, ప్రజలకు తెలియజేస్తుంది జర్నలిస్టులే..
జర్నలిస్టులు లేకపోతే నేటి విపత్తు "కరోనా" కవరేజి
కరోనా నియంత్రణ ఎలా చేయాలి ఎవరికి చేయాలి అనే దానిపైన నిరంతరం మీడియా సూచనలు సలహాలు అధికారులకు ఇస్తూ దేశదేశాలలో ఇలా చేశారు ఇలా కట్టడి చేశారు అని
మీడియా అధికారుల కు సమాచారం ఇస్తుంది..
ఈ ప్రసారాలు చూసి అధికారులు వారి వారి బాధ్యతలను నిర్వహిస్తున్నారు.. అధికారులకు పోలీసువారికి డాక్టర్లకు తగు సూచనలు ఇస్తూ మీడియా సమాంతరంగా పరిపాలన సాగేలా చూస్తున్నది..
మీడియా
మీడియా పర్యవేక్షణ లేకపోతే ప్రజలకు ఎలాంటి సదుపాయాలు అందక పోవచ్చు.. అధికారులు మొద్దు నిద్ర కు బానిస అవుతారు.. పోలీసు వారు నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తారు..,అధికారులు ఎవరు డ్యూటీలో వాళ్ళు నిద్ర పోతారు డాక్టర్ల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలవచ్చు..
ప్రజలకు ఎలాంటి సదుపాయాలు అందవు ఇలాంటివన్నీ బ్యాలెన్స్ చేస్తూ అనుక్షణం ప్రెస్ పర్యవేక్షిస్తూ ప్రజలకు సరైన సదుపాయాలు అందేలా చూస్తుంది జర్నలిస్టులే..!
జై జర్నలిస్ట్..!
What's Your Reaction?