దళితుడు బ్రతికే హక్కు లేదా - కరిసే మధు

యస్.సి కమీషన్ మాట ను కూడా బేఖాతర్ చేస్తున్న జగ్గయ్యపేట మున్సిపల్ అధికారులు

Aug 27, 2023 - 13:55
 0
దళితుడు బ్రతికే హక్కు లేదా - కరిసే మధు

మనభారత్ న్యూస్,  26 ఆగస్ట్ 2923, జగ్గయ్యపేట : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిరుద్యోగులకు బ్రతుకు తెరువు కోసం ఫిష్ ఆంధ్ర మినీ అవుట్ లెట్ ని కేటాయించింది.దీనిలో భాగంగా జగ్గయ్యపేట పట్టణంలో దళిత యస్.సి మాదిగ కులానికి చెందిన విద్యావేత్త కరిసే మధు ప్రభుత్వ పథకమైన ఫిష్ ఆంధ్ర మినీ అవుట్ లెట్ కోసం దరఖాస్తు చేసుకొనగా,ప్రభుత్వం నుండి మంజూరు అవ్వడం జరిగింది.దీని కోసం అద్దె కట్టలేక చిన్న బడీకొటును జగ్గయ్యపేట పట్టణం విద్యానగర్ ఆరో లైన్ లో గల ప్రభుత్వ ఖాళీ స్థలంలో బ్రతుకు తెరువు కోసం ఏర్పాటు చేసుకొన్నాను.జగ్గయ్యపేట పట్టణంలో పెద్ద మనిషిగా చెల్లామణి అవుతూ ఎవరు అధికారంలో ఉంటే వారికి భజన చేస్తూ పేటలో ప్రభుత్వ స్థలాలను చారుగండ్ల కొండ అనే అగ్రకులానికి చెందిన వాడు కబ్జాలు చేస్తున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.ఫిష్ ఆంధ్ర మినీ అవుట్ లెట్ నిర్వహిస్తున్న దళితుడునైన నన్ను మరియు నన్నే నమ్ముకున్న దళితుని సైతం కులం పేరుతో దుర్భాషలాడుతున్న చారుగండ్ల కొండ పై పోలీస్ వారు సెక్షన్ 3 కేసు నమోదు చేసారు.అయినప్పటికి ఫిష్ ఆంధ్ర మినీ అవుట్ లెట్ ప్రక్కన తన స్థలంగా చెప్పుకుంటున్న చారుగండ్ల కొండది కూడా ప్రభుత్వ స్థలమే.చారుగండ్ల కొండ ఆమ్యామ్యా లకు అలవాటు పడినట్లుగా ఉంది స్థానిక మున్సిపల్, పోలీస్ అధికారులు తీరు.చారుగండ్ల కొండ కనుసన్నల్లోనే అధికారులు వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నాను.మున్సిపల్, పోలీస్ అధికారులను అడ్డుపెట్టుకొని నా వ్యాపారానికి అడుగడుగునా దళితుడునైన నాకు ప్రభుత్వం అవకాశం కల్పించిన వ్యాపారాని అడుకుంటున్నాడు.ఏపి యస్.సి కమీషన్ కి దళితుడునైన నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్న విషయమై నేను విజయవాడ లో కలిసి నా మెరను విన్నవించుకున్నాను.సదరు యస్.సి కమీషన్ నా మోరను ఆలకించి జగ్గయ్యపేట మున్సిపల్ కమిషనర్ కి ఫోన్ ద్వారా దళితునికి ఇచ్చిన ప్రభుత్వ ఫిష్ ఆంధ్ర మినీ అవుట్ లెట్ జోలికి పోవదని తెలియజేశారు.అయినప్పటికి స్థానిక మున్సిపల్, పోలీస్ అధికారులు యస్.సి కమీషన్ మాటను కూడా పెడచెవిన పెట్టి ప్రభుత్వం ఇచ్చిన ఫిష్ ఆంధ్ర మినీ అవుట్ లెట్ బడీ కొట్టు,దాని కోసం ఏర్పాటు చేసుకున్న లక్ష యాబై వేల రూపాయల మేర డ్రెస్సింగ్ గచ్చులను సైతం ధ్వంసం చేశారు.మున్సిపల్ , పోలీస్ అధికారులు చారుగండ్ల కొండ ఆక్రమించిన బి.యస్.యన్ ఆఫీస్ ఎదురుగా గల ప్రభుత్వ స్థలంలో నిర్మించిన కమర్షియల్ కాంప్లెక్స్ కనబడటం లేదా, దళితుడునైన నేన్ను బ్రతుకు తెరువు కోసం ఏర్పాటు చేసుకున్న ఫిష్ ఆంధ్ర మినీ అవుట్ లెట్ ధ్వంసం చేయడం దారుణము.వెంటనే జగ్గయ్యపేట పట్టణంలో పెద్దలు చారుగండ్ల కొండా లాంటి వారు, పెద్దల ముసుగులో ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తున్న వారి పై కూడా చర్యలు తీసుకుంటారా లేక దళితుని పైనే ఇటువంటి అకృత్యాలా....సియం సార్ ఇది చూడండి నాకు న్యాయం చేయండి...అని వేసుకుంటున్న దళిత యువకుడు కరిసే.మధు, జగ్గయ్యపేట, ఎన్టీఆర్ జిల్లా. ఫోన్: 9533989090

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

Hameed Shaik మనభారత్ న్యూస్