జోన్-5 పై పిటిషన్ ను తిరస్కరించిన ఏపీ హైకోర్టు

అమరావతి రైతులకు చుక్కెదురు

May 5, 2023 - 18:45
 0
జోన్-5 పై పిటిషన్ ను తిరస్కరించిన ఏపీ హైకోర్టు

మనభారత్ న్యూస్, 5 మే 2023, ఆంధ్రప్రదేశ్ :- జోన్ 5 అంశంపై అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు శుక్రవారంనాడు తిరస్కరించింది. మరో వైపు ఇళ్ల పట్టాలకు సంబంధించి కోర్టు తీర్పునకు లోబడి ఉండాలని ఏపీ హైకోర్టు సూచించింది.

అమరావతిలోని ఆర్-5 జోన్ లో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల పరిధిలోని పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం 45 నెంబర్ జీవోను జారీ చేసింది. ఒక్కో కుటుంబానికి సెంటు స్థలం ఇవ్వాలని ప్రభుత్వం ఈ జీవో ద్వారా ప్రకటించింది. 10 లే అవుట్లలో 45 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

జీవో నెంబర్ 45 ను అమలు చేయకుండా ఇవ్వాలని అమరావతి రైతులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయమై ఇరువర్గాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు ఈ పిటిషన్ ను తిరస్కరించింది. ఇదే విషయమై అమరావతి రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో కూడా అమరావతి రైతులకు నిరాశే మిగిలింది. 

ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడ అనుకూలమైన తీర్పు రావడంతో అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీపై ప్రభుత్వం చర్యలను మరింత వేగవంతం చేసే అవకాశం ఉంది. ఈ నెల 15వ తేదీలోపుగా అమరావతిలో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఇళ్ల స్థలాల పంపిణీ తుది తీర్పునకు లోబడి ఉండాలని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

Hameed Shaik మనభారత్ న్యూస్