పిఠాపురం లోకదాలత్‌లో 111 కేసులు పరిష్కారం

Jul 1, 2024 - 00:48
Jul 1, 2024 - 14:54
 0
పిఠాపురం లోకదాలత్‌లో 111 కేసులు పరిష్కారం

మనభారత్ న్యూస్, 29 జూన్ 2024, ఆంధ్రప్రదేశ్, పిఠాపురం :-  జాతీయ లోకదాలత్‌ పిలుపుమేరకు పిఠాపురం మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పిఠాపురం కోర్టుల ఆవరణలో 12వ అదనపు జిల్లా జడ్జి ఏ.వాసంతి పర్యవేక్షణలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సు, న్యాయమూర్తులు లోక్‌అదాలత్‌ నిర్వహించారు. ఈ లోక్‌అదాలత్‌ నందు రోడ్డు ప్రమాదంలో భర్తను కోల్పోయిన బాధితురాలికి రూ.50లక్షల రూపాయలు నష్టపరిహారం ఇన్సూరెన్స్‌ కంపెనీ ద్వారా అందజేశారు. సివిల్‌, క్రిమినల్‌, మోటార్‌ వెహికల్‌, మెయింటినెన్స్‌, డివిసి కేసులు పరిష్కారం అయ్యాయి. ముఖ్యంగా గత కొంతకాలంగా కోర్టు పరిధిలో భార్యాభర్తలు వేసుకున్న విడాకుల కేసులు నలుగురు పరిష్కారం దిశగా ఆలోచన చేసి, వారు కలుసుకున్నారు. కార్యక్రమంలో సీనియర్‌ సివిల్‌ జడ్జ్‌ ఎం.బాబు, జూనియర్‌ సివిల్‌ జడ్జ్‌ ఎం.విజయ రామేశ్వరి, న్యాయవాదులు కె.వీరభద్రరావు, ఇన్సూరెన్స్‌ సంస్థ స్టాండిరగ్‌ కౌన్సిల్‌ న్యాయవాది ఎస్‌.వి.రాధాకృష్ణ, వై.వి.యన్‌.మూర్తి, డి.రమేష్‌ బాబు, కొంజర్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

suneelkumaryandra My Name is Dr Suneelkumar Yandra, Journalist, Writer & Film Director.