తెలంగాణ 'ఫేక్' చిలకలు అప్పుడే ఏపీ లో పని మొదలు పెట్టేసాయా ?

నిన్నటిదాకా తెలంగాణాలో చిలక జోస్యం చెప్పిన వారు ఇపుడు ఏపీకి షిఫ్ట్ అయిపోతున్నారు

Dec 7, 2023 - 11:03
 0
తెలంగాణ 'ఫేక్' చిలకలు అప్పుడే ఏపీ లో పని మొదలు పెట్టేసాయా ?

మనభారత్ న్యూస్, 7th డిసెంబరు 2023, ఆంధ్రప్రదేశ్   :  నిన్నటికి నిన్న తెలంగాణా ఎన్నికలు అయ్యాయి. ఏపీలో చూస్తే ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. కనీసంగా చూస్తే మూడు నాలుగు నెలలు బిగిసి ఉంది. అయితే అపుడే ఎన్నికల వేడి మొదలైంది. దాంతో పాటు రాజకీయ జ్యోతీష్యులు తమ వర్క్ స్టార్ట్ చేసేశారు. నిన్నటిదాకా తెలంగాణాలో చిలక జోస్యం చెప్పిన వారు ఇపుడు ఏపీకి షిఫ్ట్ అయిపోతున్నారు. అక్కడ తమ జోస్యాలు సర్వేలతో హడావుడిని ప్రారంభించేశారు.

 ఇక తెలంగాణాలో అయితే రాజకీయ జోస్యాలకు భలే గిరాకీ ఏర్పడింది. దాంతోపాటు తమ వైపు ఓటర్లు ఉన్నట్లుగా రాజకీయ వాతావరణం అనుకూలంగా ఉన్నట్లుగా చేసుకున్న సర్వేలు కూడా బయటకు వదిలారు. అలా వాటి కోసం పెద్ద ఎత్తున ఖర్చు కూడా అనేక పార్టీలు పెట్టినట్లుగా కూడా వార్తా కధనాలు వచ్చాయి. వాటిని ఫేక్ సర్వేలు అంటూ ప్రత్యర్థి పార్టీలు విమర్శలు కూడా చేస్తూ వచ్చాయి. ఎంత చేసినా జనం చెప్పాల్సింది చెప్పారు, ఇవ్వాల్సిన తీర్పు ఇచ్చారు. ఫేక్ సర్వేలను వదిలిన వారు చివరికి చేతులు కాల్చుకోవాల్సి వచ్చింది.

ఇదిలా ఉంటే ఏపీలో ఇపుడు ఫేక్ సర్వేల టైం వచ్చింది అంటున్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఫేక్ సర్వేలను అపుడే బయటకు ఒక్కోటి వదులుతున్నారని టాక్ నడుస్తోంది. తమ క్రియేటివిటీని అంతా ఉపయోగించి మరీ ఫేక్ సర్వేలలో టాలెంట్ చూపిస్తున్నారుట. అధికార వైసీపీ విపక్ష టీడీపీ ఈ విషయంలో దొందుకు దొందే అని అంటున్నారు.

ఈ రెండు పార్టీలు పెద్ద ఎత్తున దొంగ అడ్రసులు పెట్టి మరీ చేసిన సర్వేలు సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం చేయడానికి రంగం సిద్ధం చేసాయని అంటున్నారు. ఏపీలో ఇపుడు సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంది. దాంతో పాటు జనాలు కూడా స్మార్ట్ ఫోన్ల వినియోగంలో ముందంజలో ఉన్నారు. దాంతో అక్కడే తేల్చుకోవాలని అన్ని పార్టీలు చూస్తున్నాయట

అంతే కాదు ఫేక్ సర్వేలను తయారు చేయించి మరీ మా పార్టీయే అధికారంలోకి వచ్చేస్తుంది అని హడావుడి ఒక లెవెల్ లో చేస్తున్నారు అని అంటున్నారు. దీని కోసం భారీగానే ఖర్చు పెడుతున్నారు అని అంటున్నారు. వచ్చేది మేమే అంటూ వైసీపీ అంటూంటే లేదు మేమే వస్తున్నామని టీడీపీ అంటోంది .

ఈ రెండు పార్టీలకు జనాల మనసుని తమ వైపునకు తిప్పుకోవడానికి సర్వేలే ఆధారం కావడం విశేషం. సర్వేలను చూసి జనాలు మైండ్ సెట్ మార్చుకుని ఒక్కసారిగా చేంజ్ అవుతారని భావిస్తున్నారు. ఆ మీదట తమకు ఓట్ల వర్షం కురుస్తుంది అని కూడా లెక్కలేస్తున్నారు. అయితే జనాలు తెలివి మీరిపోయారు అన్నది తెలియడం లేదు అంటున్నారు.

తెలంగాణాలో బీఆర్ ఎస్ వస్తుంది అని ఎంత ఊదరగొట్టినా చివరికి జనం గుండెలలో ఏముందో అదే తీర్పు రూపంలో వచ్చింది అని అంతున్నారు. జనాలు ఇపుద్డు బాగా తెలివి మీరిపోయారు అని అంటున్నారు. వారికి అన్నీ తెలుసు అన్నది కూడా వాస్తవం. తమకు ఏమి కావాలి ఏది ఏ రాజకీయ పార్టీకి ఓటేయాలి అన్నది వారికి వారు నిర్ణయించుకుంటున్నారు. సర్వేల పట్ల జనాలు అయితే పెద్దగా నమ్మకం చూపించడంలేదు.

గతంలో జరిగిన ఎన్నికల్లో సర్వేల ప్రభావం ఏమైనా ఉందేమో కానీ ఇపుడు చూస్తే అలాంటిది ఏమీ కనిపించడంలేదు. అయినా సరే పాత ప్రయోగాలే చేస్తున్నాయి ఏపీలో వైసీపీ టీడీపీ. మరి జనాలు వీటిని నమ్ముతారా అన్నది పెద్ద ప్రశ్న. జనాలను ఏమార్చడం ఎవరికీ సాధ్యం కాదనే అంటున్నారు

నిజం చెప్పాలంటే ఈసారి ఏపీలో ఎన్నికలు టఫ్ గా సాగుతాయి. అయిదేళ్ల టీడీపీ మరో అయిదేళ్ల వైసీపీ పాలన కళ్ల ముందు ఉన్నయి. రెండింటి ద్వారా ప్రజలకు ఏమి ఒనకూడింది అన్నది ఆలోచించి మరీ ప్రజలు తీర్పు ఇస్తారు. తెలంగాణాలో అయితే బీఆర్ఎస్ కి రెండు దఫాలుగా అవకాశాలు ఇచ్చారు. కాంగ్రెస్ పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉంది. పైగా తెలంగాణ వచ్చాక కాంగ్రెస్ పాలన ఏమిటి అన్నది జనాలు చూడలేదు.

ఇక అక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ రేవంత్ రెడ్డి కొత్త ముఖం. ఇలా ఎన్నో ఫ్యాక్టర్స్ కలిసి కాంగ్రెస్ కి పట్టం కట్టాయి. ఏపీలో చూస్తే పాత చింతకాయ పచ్చడి అన్నట్లుగానే రేపటి ఎన్నికలు ఉన్నాయని అంటున్నారు. అందువల్ల ప్రజలకు ఈసారి ఎన్నికలు ఉత్సాహం కంటే నిర్వేదాన్నే కలిగిస్తాయని అంటున్నారు. ఆ నేపధయంలో ఫేక్ సర్వేలు ఎన్ని వదిలినా జనాల మనసు గెలవడం చాలా కష్టమే అని అంటున్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

Hameed Shaik మనభారత్ న్యూస్