అమెరికాలో ఫ్లూ కోవిడ్-19 విజృంభణ... లక్షణాలివే

యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ)కి నివేదించబడిన కోవిడ్-19 పరీక్షల్లో 10 శాతం పాజిటివ్‌ గా ఉన్నాయని ఈ సీడీసీ డేటాను ఉటంకిస్తూ జిన్హువా వార్తా సంస్థ నివేదించింది.

Dec 7, 2023 - 05:20
 0
అమెరికాలో ఫ్లూ  కోవిడ్-19 విజృంభణ... లక్షణాలివే

మనభారత్ న్యూస్, 7th డిసెంబరు 2023  : మారుతున్న వాతావరణ పరిస్థితులో.. లేక, యూఎస్ రిపబ్లికన్ సెనెటర్లు అనుమానిస్తున్నట్లు చైనాకు సాగిస్తున్న రాకపోకల ఫలితమో తెలియదు కానీ... అగ్ర రాజ్యం అమెరికాలో ఫ్లూ, కోవిడ్-19 ఇన్ఫెక్షన్‌ కి గురైనవారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఇందులో ముఖ్యంగా చిన్న పిల్లలలో కోవిడ్‌ కు పాజిటివ్‌ గా వచ్చిన వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో తీవ్రమైన లక్షణాలతో వారంతా ఆసుపత్రులలో చేరుతున్నారు. 

అవును... యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ)కి నివేదించబడిన కోవిడ్-19 పరీక్షల్లో 10 శాతం పాజిటివ్‌ గా ఉన్నాయని ఈ సీడీసీ డేటాను ఉటంకిస్తూ జిన్హువా వార్తా సంస్థ నివేదించింది. గతవారంతం నుంచి వీరి సంఖ్య మరింత పెరుగుతుందని తెలిపింది. ఇందులో భాగంగా.. గత వారంతో పోలిస్తే తాజా వారంలో కోవిడ్ - 19 నిర్ధారణ అయిన అత్యవసర విభాగాలు 10శాతం పెరిగాయి.

గత వారాంతానికి కోవిడ్ వల్ల ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య దాదాపు 20,000కి చేరుకుందని. ఇది తాజాగా 10 శాతం పెరిగిందని సీడీసీ డేటా చెబుతుంది. దీంతో ఇప్పటికీ కోవిడ్... ప్రజలను శ్వాసకోసం వ్యాదులతో ఇబ్బందిపెడుతూనే ఉందని... ఈ క్రమంలో ప్రతి వారం సుమారు 15,000 మంది ఆసుపత్రిలో చేరుతుండగా.. వారిలో సుమారు 1,000 మంది మరణిస్తున్నారని సీడీసీ డైరెక్టర్ మాండీ కోహెన్ చెబుతున్నారు!

ఇదే క్రమంలో సీడీసీ తాజా డేటా ప్రకరాం అగ్రరాజ్యంలో ఫ్లూ రేట్లు కూడా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా చేయించుకుంటున్న టెస్ట్ లలో 6శాతం పాజిటివ్ రేటుతో గతవారాంతానికి సుమారు 4,268 మంది ఆసుపత్రిలో చేరారని తెలుస్తుంది. ఈ క్రమంలో ఈ సీజన్ లో ఇప్పటివరకు 1,100 మంది పెద్దలు, ఎనిమిది మంది పిల్లలు ఫ్లూ సంబంధిత కారణాల వల్ల మరణించారని నివేదికలు చెబుతున్నాయి.

ఈ సమయంలో ప్రధానంగా యూస్ లోని మధ్యపశ్చిమ, ఈశాన్య ప్రాంతాల్లో కోవిడ్ - 19 కేసులు ఎక్కువగా పెరిగాగా... ఇన్ ఫ్లుయేంజా అనారోగ్యం రేటు దక్షిణ భాగంలో ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఇక ప్రధానంగా మాస్క్ వాటి వ్యాప్తికి కారణమయ్యే కణాలను సమర్థవంతంగా అడ్డుకుంటుందని చెబుతున్నప్పటికీ ప్రధానంగా ఈ గాలిలో కణాలను నిరోధించడానికి కేఏన్ 95 లేదా ఎన్ 95 మాస్క్ ఉత్తమమని చెబుతున్నారు.

ఫ్లూ లక్షణాలు ఈ కింది విధంగా ఉంటాయి:

జ్వరం

చలి

దగ్గు

గొంతు నొప్పి

ముక్కు కారడం లేదా మూసుకుపోవడం

కండరాలు లేదా శరీర నొప్పులు

తలనొప్పి

అలసట

వాంతులు – విరేచనాలు

కోవిడ్ -19 లక్షణాలు:

ముక్కు కారడం లేదా మూసుకుపోవడం

తలనొప్పి

అలసట

తుమ్ములు

గొంతు నొప్పి

దగ్గు

వాసనలో మార్పులు

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

admin ManaBharat News