ప్రభుత్వ హాస్పిటల్ లో డయోరియా కేసులను పరిశీలించిన సిపిఐ పార్టీ నాయకులు
మనభారత్ న్యూస్, 21 జూన్ 2024, ఆంధ్రప్రదేశ్, జగ్గయ్యపేట :- జగ్గయ్యపేట పట్టణంలో గత కొన్ని రోజులుగా ప్రమాదకరమైన వాంతులు,విరోచనాలతో డయోరియా కేసులు ఎక్కువ మంది ప్రభుత్వ హాస్పిటల్ లో చేరి వైద్యం చేయించుకుంటున్నారు.జగ్గయ్యపేట పట్టణ ప్రభుత్వ హాస్పిటల్ లో డెయోరియా బారినపడిన రోగులను సిపిఐ పార్టీ బృందం పరిశీలించడం జరిగింది.ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి జూనెబోయిన శ్రీనివాసరావు మరియు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి అంబోజి శివాజీ లు మాట్లాడుతూ జగ్గయ్యపేట పట్టణ మరియు నియోజకవర్గం పలు గ్రామాలల్లో కలుషిత త్రాగడం ద్వారా ప్రజలు కొంతమంది ప్రజలు డెయోరియా భారినపడుతున్నారన్నారు.ఇప్పటికే ప్రభుత్వ వైద్యశాలలో జగ్గయ్యపేట పట్టణం,బూదవాడ,షేర్ మహమ్మద్ పేట,వత్సవాయి,మక్కపేట పలు గ్రామల ప్రజలు డెయోరియా భారినపడిన వారు వైద్యం చేయించుకుంటున్నారన్నారు.డయోరియా మహమ్మారి రోగానికి గురైన మరికొందరు విజయవాడ ప్రభుత్వ మరియు ప్రైవేటు వైద్యశాలలో వైద్యం చేయించుకుంటున్నట్లు సమాచారం.ఈ డెయోరియా మహమ్మారి నుండి ప్రజలను కాపాడాలంటే తక్షణమే మున్సిపాలిటీ,పంచాయతీలు పారిశుధ్యం నిర్వహణలో భాగంగా యుద్ధప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి మహ్మద్ అసదుల్లా,సిపిఐ నాయకులు మెటికల శ్రీనివాసరావు,ఏవైయఫ్ నియోజకవర్గ అధ్యక్షులు యండ్రపల్లి బాను తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?