ఆరోగ్యకర ఆహారం తో డయాలసిస్ ముప్పు నుండి బయటపడండి
మనభారత్ న్యూస్, 21 జూన్ 2024, ఆంధ్రప్రదేశ్ :- డయాలిసిస్ చేసే సమయంలో, శరీరంలోని రక్తాన్ని క్రిందున్న ఎఱ్ఱ ట్యూబ్ ద్వారా బయటకు తీసి, డయాలిసిస్ యంత్రంలో శుభ్రపఱచి, నీలి రంగు ట్యూబ్ ద్వారా తిరిగి శరీరంలోకి పంపిస్తారు. శరీరంలోని రక్తమంతా శుభ్రపరచడానికి షుమారుగా 4 గంటలు పడుతుంది. ఈ నాలుగు గంటలు శరీరాన్ని కదల్చకుండా ఉంచాలి.
ఈ ప్రక్రియ వారానికి మూడు సార్లు, నెలకు 12 సార్లు నిర్వహించాలి. ప్రతిసారీ 4 గంటలు, అంటే నెలకు 48 గంటలు, వెచ్చించాలి.
డయాలిసిస్ అవసరం లేని వారిలో, ఈ ప్రక్రియను, ఎలాంటి ప్రయాస & అసౌకర్యం లేకుండా, కిడ్నీలు రోజుకు 36 సార్లు వాటంతటవే చేస్తాయ్.
ఇది చదివిన తరువాత, మిత్రులు.. అతిగా మద్యం సేవించక పోవడం, ధూమపానం చేయకపోవడం, బయట హోటళ్లలో/ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో లభించే తినుబండారాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండడం, అధిక చక్కెర/మైదా తో తయారయ్యే పదార్థాలను చాలా చాలా మితంగా తీసుకోవడం, అన్నిటికంటే ముఖ్యంగా శారీరక శ్రమ చేయడం.. వంటి ఉత్తమ జీవన శైలి/అలవాట్లను అలవరచుకుంటారని ఆశిస్తా. ఎందుకంటే, ఇవి, మన కాలేయం & కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అందుబాటులో ఉన్న అత్యంత చౌకైన మార్గాలు.
మంచి ఆరోగ్యానికి ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉండండి.
What's Your Reaction?