ఏ నొప్పి అయినా సరే కర్పూరంతో ఇలా చెక్
కర్పూరం ధూపం వేయడం వల్ల క్రిమికీటకాలు రాకుండా పోతాయి. కర్పూరంలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి.
మనభారత్ న్యూస్ , ఆరోగ్య చిట్కాలు : మన సంప్రదాయంలో కర్పూరానికి చాలా ప్రాధాన్యం ఉంది. దేవుడికి హారతి ఇవ్వడంలో దీన్ని వాడతారు. ఇంట్లో ధూపం వేసే సమయంలో కూడా దీన్ని ఉపయోగిస్తారు.
తీర్థ ప్రసాదాలు, తీపి వంటకాల్లో కూడా దీనికి ప్రాతినిధ్యం ఉంటుంది. కర్పూరం వెలిగించడంలో వచ్చే వాసన ఎంతో బాగుంటుంది. కర్పూరం ధూపం వేయడం వల్ల క్రిమికీటకాలు రాకుండా పోతాయి. కర్పూరంలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. కర్పూరం మనకు పెయిన్ కిల్లర్ గా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
కండరాల నొప్పులు, కండరాలు పట్టేయడం వంటి సమస్యలు తగ్గిస్తుంది. గాయాలు, దెబ్బలు తగిలినప్పుడు వాపుతో పాటు నొప్పి వస్తుంది. నొప్పులను తగ్గించడంలో ప్రధాన భూమిక పోషిస్తుంది. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గించడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. నొప్పి కలిగించే భాగంలో నరాల నొప్పి మెదడుకు చేరవేస్తాయి. నొప్పి కలిగించే నరాలను శాంతింప చేసి నొప్పి తెలియకుండా చేయడంలో కర్పూరం ఉపయోగపడుతుంది. కర్పూరం మీద మెక్సికో శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో పలు విషయాలు తెలిశాయి.
ఒక గిన్నెలో ఆవనూనె తీసుకుని అందులో కర్పూరం వేసి మరిగించాలి. కర్పూరం కరిగిన తరువాత ఈ నూనెను గోరువెచ్చగా అయ్యాక నొప్పి ఉన్న భాగంలో రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల నరాల నొప్పి తగ్గుతుంది. రక్తప్రసరణ బాగా జరగడం వల్ల నొప్పి కలిగించే భాగాల్లో వ్యర్థాలు తొలగిపోతాయి. సహజసిద్ధంగా వచ్చే నొప్పి తగ్గుతుంది. కర్పూరాన్ని పిల్లల నుంచి పెద్దల వరకు అందరు ఉపయోగించుకుని అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.
కండరాల నొప్పి ఉన్నప్పుడు దీన్ని రాసుకుంటే ఇంగ్లిష్ మందులు వాడాల్సిన అవసరం లేదు. కర్పూరాన్ని ఉపయోగించుకుని టాబ్లెట్లు లేకుండా నొప్పుల నుంచి ఉపశమనం పొందే చిట్కాను అందరు పాటించాలి. నొప్పులను తగ్గించుకోవడంలో కర్పూరం ఇంత కీలకంగా వ్యవహరిస్తుందని తెలియక చాలా మంది మాత్రలు వాడుతూ తమ ఆరోగ్యాన్ని ఇంకా చెడగొట్టుకుంటున్నారు. ఇలా కర్పూరంతో చేసుకునే చిట్కాలతో మనకు ఎన్నో రకాల ప్రయోజనాలు దక్కుతున్నాయి.
.
What's Your Reaction?