రెండు వారాలకు మించిన దగ్గు- క్షయ వ్యాధి కావచ్చు
పోషకాహార లోపం, చెడు అలవాట్లు, ముఖ్యంగా విద్యార్థులు, యువత క్షయ వ్యాధి బాధితులు అవుతున్నారు
మనభారత్ న్యూస్, 24 మార్చి 2023, ఆంధ్రప్రదేశ్ : ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం దినోత్సవం సందర్భంగా మాటూరుపేట వైద్యాధికారి డాక్టర్ వెంకటేష్ గారి ఆధ్వర్యంలో మాటూరు పేట, మాటూరు, ఆతుకూరు, సిరిపురం గ్రామాలలో క్షయ వ్యాధి నివారణ అవగాహన, మరియు పరీక్షలు చేయడం జరిగినది.
రెండు వారాల నుంచి దగ్గు, రాత్రిపూట జ్వరం, రాత్రిపూట చెమటలు అధికంగా పట్టడం, దగ్గితే తెమడి తోపాటు రక్తం పడటం, బరువు తగ్గిపోవడం, దీర్ఘకాలిక షుగర్, bp, వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం ఇలాంటి లక్షణాలున్న వారు ఎవరైనా పిల్లల నుంచి పెద్దల వరకు మాటూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని రకాల పరీక్షలు ఉచితంగా పరీక్షించి మందులు ఇవ్వబడును..
ప్రధానమంత్రి ముక్త్ భారత్ పథకం, నిక్షయ అభియాన్ పథకం కింద క్షయ వ్యాధి మందులు వాడుతున్న వారికి ప్రతినెల పోషకాహార నిమిత్తం 500 రూపాయలు వారి అకౌంట్లో వేయబడును.
పోషకాహార లోపం, చెడు అలవాట్లు, ముఖ్యంగా విద్యార్థులు, యువత క్షయ వ్యాధి బాధితులు అవుతున్నారు
కారణం పోషకాహార లోపం, బేకరీ ఫుడ్ స్వీట్స్ ఎక్కువగా తినడం అరగటం కోసం కూల్డ్రింక్స్ తాగడం., తద్వారా పోషకాహార లోపం వచ్చి, వ్యాధి నిరోధక శక్తి తగ్గి అంటురోగాలు బ్యాక్టీరియల్ వైరల్ డిసీజులు,, చిన్న వయసులోనే అధిక బరువు ఊబకాయం ఇవి కూడా పోషకాహార లోపం వల్లే వచ్చును..
ప్రజలందరూ ఇప్పుడే అప్రమత్తంగా ఉండి, బిపి షుగర్ పరీక్షలు చేయించుకుని తగిన మందులు వేసుకుని అదుపులో ఉంచుకుంటూ మంచి పోషకాహారం తీసుకుంటూ తగిన శారీరక శ్రమ చేయాలని, ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట నడవాలి అని,, మోకాళ్ళ నొప్పి ఉన్నవారు ఈత నేర్చుకొని ఆరోగ్యవంతులుగా మారాలని అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో HEO శరత్ బాబు,టిబి నోడల్ పర్సన్ వి భాస్కరరావు, STSసందీప్,STLS శివ,MLHP ప్రదీప్, మహిళా ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు,అంగన్వాడీ కార్యకర్తలు గ్రామ సర్పంచులుపాల్గొన్నారు.
What's Your Reaction?