పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై పట్టణ వాలంటీర్లు నిరసన.
మనభారత్ న్యూస్, NTR జిల్లా / జగ్గయ్యపేట టౌన్, 11-07-2023(మంగళవారం) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లోని వాలంటీర్లపై అభ్యంతరకరమైన తీవ్రమైన వ్యాఖ్యలకు జగ్గయ్యపేట పట్టణ వాలంటీర్స్ తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పట్టణంలోని 14 సచివాలయాలకు సంబంధించిన వాలంటీర్లు తీవ్రమైన నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ చిత్రపటాలను దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా వాలంటీర్స్ మాట్లాడుతూ నిన్న ఏలూరు వద్ద జరిగిన సభలో పవన్ కళ్యాణ్ వాలంటీర్స్ పై అభ్యంతరకరమైన,తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మమ్మల్ని అగౌరవపరిచిన పవన్ కళ్యాణ్ వెంటనే రాష్ట్రంలోని వాలంటీర్లు అందరికీ బేషరతుగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా వాలంటీర్ల గురించి పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేయడం తగదని అన్నారు.
గత నాలుగేళ్లగా మేము మా వంతు మంచిగా ప్రజలకు సేవలు అందిస్తున్నామని, ఏ ఒక్క ఇంటిని నిర్లక్ష్యం చేయకుండా కుల,మత,ప్రాంత,పార్టీలకతీతంగా మేము సేవలు అందిస్తున్నామన్నారు.ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా మా వంతు పనిచేస్తున్నామన్నారు.అవ్వ,తాతలకు,ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ అందిస్తున్నామని తెలిపారు.ఇలాంటి సేవలందిస్తున్న మా పై పవన్ కళ్యాణ్ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం బాధాకరమని, మరలా ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే తగిన విధంగా బుద్ధి చెప్తామని ఘాటుగా విమర్శించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకర్,హఫీజున్నిసా ఫిరోజ్ ఖాన్,పట్టణ అధ్యక్షులు ఆకుల శ్రీకాంత్ బాజీ,యువజన విభాగం అధ్యక్షులు ఆవాల భవాని ప్రసాద్,మహిళా విభాగం అధ్యక్షురాలు ముసిని రాజ్యలక్ష్మి,పెనుగంచిప్రోలు మండల సచివాలయాలు కన్వీనర్ కన్నమల శామ్యూల్, నాయకులు కాసర్ల బాలస్వామి,శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?