ఊరు - వాడ.. ఆరోగ్య సురక్ష
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 17.10.2023 : కాండ్రపాడు గ్రామం - నందిగామ టౌన్ డివిఆర్ కాలనీలో "జగనన్న ఆరోగ్య సురక్ష "కేంద్రాలను ప్రారంభించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
రాష్ట్రవ్యాప్తంగా స్పెషలిస్టు డాక్టర్ల పర్యవేక్షణలో ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది.. గ్రామాల్లో ప్రజలు పెద్ద ఎత్తున కేంద్రాలకు తరలివచ్చి వైద్య సేవలను వినియోగించుకుంటున్నారు : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
శిబిరాల్లో ప్రజలు రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా స్పెషలిస్ట్ వైద్యుల సేవలను పొందుతున్నారు. డాక్టర్లు సూచించిన మందులను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోంది ..
రాష్ట్రంలో ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ప్రజల ఆరోగ్య సమస్యలు, అవసరాలను గుర్తించి పరిష్కరించేలా జగనన్న ఆరోగ్య సురక్ష : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రులకు రిఫర్ చేసిన వారికి ఉచితంగా వైద్య సేవలు అందించేలా ఫ్యామిలీ డాక్టర్లు, ఏఎన్‌ఎం, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌వో) పర్యవేక్షిస్తున్నారు..
మాకు వ్యయ, ప్రయాసలు లేకుండా వైద్యులే గ్రామాల్లోకి వచ్చి వైద్యం చేయడం ఎంతో మేలు చేస్తోందన్న గ్రామస్తులు, మహిళలు ..
ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైద్యారోగ్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు ..
What's Your Reaction?