హైదరాబాద్ నగరంలో త్వరలో టన్నెల్ ఆక్వేరియం!
రంగారెడ్డి జిల్లా కొత్వాల్‌గూడలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఎకో పార్క్‌లో ఈ అక్వేరియం నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి
మనభారత్ న్యూస్, 17 ఏప్రిల్ 2023, తెలంగాణ : హైదరాబాద్ నగరంలో మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. దీని నిర్మాణ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. త్వరలోనే ఇది సందర్శకులకు అందుబాటులోకి రానుంది. చారిత్రాత్మక కట్టడాలు, పర్యాటక కేంద్రాలకు కేంద్రబిందువైన భాగ్యనగరానికి అదనపు అందాన్ని తెచ్చి పెట్టేలా ఈ ప్రాజెక్ట్‌ను తీర్చిదిద్దుతోంది తెలంగాణ ప్రభుత్వం.
దేశంలోని పలు నగరాల్లో అండర్ టన్నెల్ అక్వేరియాలు ఉన్నాయి. బెంగళూరులో అండర్ వాటర్ టన్నెల్ అక్వేరియం సందర్శకులకు అందుబాటులో ఉంది. అలాంటిదే హైదరాబాద్‌లో కూడా ఏర్పాటు కానుంది. హైదరాబాద్‌లో అండర్ వాటర్ టన్నెల్ అక్వేరియాన్ని నిర్మించే అవకాశాలను పరిశీలించాలంటూ ఓ నెటిజన్ చేసిన సూచనలకు కేటీఆర్ స్పందించారు. కొద్దిసేపటి కిందటే దీనికి రిప్లై ఇచ్చారు.
దేశంలోనే అతిపెద్ద అక్వేరియాన్ని ప్రభుత్వం నిర్మిస్తోంది. రంగారెడ్డి జిల్లా కొత్వాల్‌గూడలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఎకో పార్క్‌లో ఈ అక్వేరియం నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. పక్షుల ఆవాస కేంద్రంగా కూడా ఇది ఆవిర్భవించనుంది. దేశంలోనే అతిపెద్ద అక్వేరియం, పక్షుల ఆవాస కేంద్రంగా దీన్ని నిర్మిస్తోన్నామని, త్వరలోనే ఇది అందుబాటులోకి వస్తుందని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.
కొత్వాల్‌గూడలో ఎకో పార్క్‌కు ఇదివరకే శంకుస్థాపన చేశారు కేటీఆర్. ఉస్మాన్ సాగర్‌లో ల్యాండ్ స్కేప్ ఎకో పార్కును కూడా సందర్శకుల కోసం ప్రారంభించారు. ఇందులో భాగంగా ఈ అక్వేరియం సందర్శకులకు త్వరలోనే అందుబాటులోకి రానుంది. మున్సిపల్ శాఖ దీని నిర్మాణ పనులను పర్యవేక్షిస్తోంది.
What's Your Reaction?