కేసీఆర్ కనిపించడం లేదంటూ గజ్వేల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు
ఫిర్యాదు చేసిన టీపీసీసీ అధికార ప్రతినిధి
మనభారత్ న్యూస్ ప్రతినిధి, 7అక్టోబరు 2024, హైదరాబాద్, తెలంగాణ : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కనిపించడం లేదని, ఆయన ఎక్కడున్నారో వెతకాలంటూ గజ్వేల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్‌రావు గజ్వేల్ పోలీసు స్టేషన్లో ఈ విధంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పదేళ్లుగా సీఎంగా ఉన్న కేసీఆర్.. ప్రస్తుతం ఎమ్మెల్యేగా గజ్వేల్ ప్రజలకు సేవలు అందించాలన్నారు. పోలీసులు పది రోజుల్లో కేసీఆర్ ఆచూకీ తెలపకపోతే.. తామే స్వయంగా గాలిస్తామన్నారు.
What's Your Reaction?