సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం
మనభారత్ న్యూస్, 5 అక్టోబరు 2024, హైదరాబాదు : సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన కూతురు గాయత్రి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. కార్డియాక్ అరెస్ట్ కావడంతో నిన్న గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. చికిత్స పొందుతూ గాయత్రి తుది శ్వాస విడిచారు. రాజేంద్రప్రసాద్‌కు కుమారుడు, ఓ కూతురు. గాయత్రి ఆకస్మిక మృతితో షాక్‌లో ఉంది రాజేంద్రప్రసాద్ కుటుంబం. హైదరాబాద్ కూకట్‌పల్లిలో గాయత్రి భౌతికకాయానికి కుటుంబసభ్యులు నివాళి అర్పిస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్‌ను పరామర్శిస్తున్నారు.
What's Your Reaction?