పవన్ కు దెబ్బ ఇంతగట్టిగా తగిలిందా ?
పార్టీలోని నేతలు నోటికొచ్చింది మాట్లాడటం వల్ల దాని ప్రభావం పార్టీపైన పడుతోంది
మనభారత్ న్యూస్, 25 ఏప్రిల్ 2023 : జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కు దెబ్బ బాగా గట్టిగానే తగిలినట్లుంది. అందుకనే అర్ధంపర్ధంలేని ఒక సందేశాన్ని జనసేన నేతలు, వీరమహిళలు, జనసైనికులకు ఓపెన్ లెటర్ రూపంలో పంపారు.
ఆ లేఖలో పవన్ ఏమి చెప్పదలచుకున్నారు ? ఏమిచెప్పారో కూడా చాలామందికి అర్దమైనట్లులేదు. అందులోని సారంశం ఏమిటంటే ఎవరు కూడా ఎవరిగురించి కూడా నోటికొచ్చింది మాట్లాడద్దు. నిర్ధారణ కాని విషయాలను అసలు ప్రస్తావించద్దు.
తీవ్రమైన ఆర్ధికనేరాల గురించి మాట్లాడేముందు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటి దృష్టికి తీసుకెళ్ళండన్నారు. పార్టీలోని నేతలు నోటికొచ్చింది మాట్లాడటం వల్ల దాని ప్రభావం పార్టీపైన పడుతోందని పవన్ తెగ బాధపడిపోయారు. పొత్తుల గురించి కూడా ఎవరు అనవసరంగా మాట్లాడద్దన్నారు. సమయం వచ్చినపుడు తాను నిర్ణయం తీసుకుంటానని కూడా మరోసారి స్పష్టంగా చెప్పారు. ఎవరు కూడా హద్దులు దాటి మాట్లాడద్దని స్పష్టంగా వార్నింగ్ ఇచ్చారు.
అసలీ అసంబద్ధమైన లెటర్ ఎందుకు రాసినట్లు ? ఎందుకంటే మైత్రీ మూవీస్ సంస్ధలో వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి పెట్టుబడులున్నాయని వైజాగ్జనసేన కార్పొరేటర్ మూర్తియాదవ్ ఐటి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారట. బాలినేనితో పాటు ఆయన బంధువుల పెట్టుబడులు మైత్రీనిర్మాణ సంస్ధలో ఉన్నాయని యాదవ్ ఆరోపించారు. ఆరోపణల ఆధారంగానే నాలుగురోజుల పాటు సంస్ధపై ఐటి దాడులుచేసిందనే ప్రచారం అందరికీ తెలిసిందే.
యాదవ్ అలా ఫిర్యాదుచేశారో లేదో బాలినేని వెంటనే పవన్ పై ఎటాక్ చేశారు. బాలినేని దెబ్బకు పవన్ కు బుర్ర గిర్రున తిరుగుంటుంది. విషయం ఏమిటంటే పార్టీ అనుమతిలేనిదే లేదా పవన్ కు తెలీకుండానే యాదవ్ ఐటి శాఖకు ఫిర్యాదుచేస్తారా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. దీనికి కారణం ఏమిటంటే పవన్ హీరోగా మైత్రీమూవీస్ సినిమా మొదలైంది. అంటే తాను ఎవరి నిర్మాణసంస్ధలో అయితే నటిస్తున్నారో అదే సంస్ధపై తమ పార్టీ నేతే ఐటి శాఖకు ఫిర్యాదుచేశారు. పవన్ కు ఎక్కడో దెబ్బపడుంటుంది. అందుకనే మూర్తి యాదవ్ అని కాకుండా జనరల్ లెటర్ ను పోస్టుచేశారు.
What's Your Reaction?