యదేచ్చగా చెరువు మట్టి తవ్వకాలు
మాకేం తెలియదన్నట్లు వ్యవహరిస్తున్న అధికారుల తీరు
మనభారత్ న్యూస్, 26 జూన్ 2024, ఆంధ్రప్రదేశ్, గౌరవరం, జగ్గయ్యపేట :- జగ్గయ్యపేట మండలంలో అధికార పార్టీల బదలాయింపుతో గౌరవరం మరియు పలు గ్రామాల్లో యద్దేచ్ఛగా చెరువు మట్టి త్రవ్వకాలు జరుపుతున్న వైనం.... సంబంధిత అధికారులు మాత్రం మాకెందుకులే అనుకొని గాలికి వదిలేసారనే వాదనలు ప్రజల నుండి వినిపిస్తున్నాయి. అంతా మా ఇష్టం మేం ఏదైన త్రవ్వుకుంటామన్నట్లు ఉంది మట్టి త్రవ్వకం దారుల తీరు.... ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం గత పాలన కన్న భిన్నంగా ప్రజా రంజక పాలన అందిస్తామంటుంటే, దీనికి భిన్నంగా మట్టి తవ్వకం దారుల తీరు కన్నబడుతుందని ప్రజలు భావిస్తున్నారు...
మట్టి తవ్వకాలకు బ్రేకులు వేసే అధికారులు ఎక్కడున్నారు. వారికి తెలిసి కూడా తెలియనట్లు వ్యవహరిస్తున్నారా అని ప్రజల నుండి పలు వాదనలు వినిపిస్తున్నాయి. మట్టి త్రవ్వకాల పైన పెట్టే శ్రద్ద చెట్లు నాటుటీతే పర్యావరణంలో కాలుష్యం కొంత మేర తగ్గే అవకాశాలున్నాయి అంటున్న ప్రజలు...
What's Your Reaction?