పంచ్‌ లతో కస్టమర్లకు వడ్డించిన ”లేడీ బ్రూస్‌ లీ”!

Apr 17, 2023 - 20:08
 0  135

తనతో అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరు కస్టమర్లకు తన పంచ్‌ లతో సమాధానమిచ్చింది ఓ లేడి వెయిట్రస్‌. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌ గా మారిన ఈ వీడియోను ప్రముఖ ట్విట్టర్‌ ఖాతా సీసీటీవీ ఇడియట్స్‌ పోస్ట్‌ చేసింది. ఈ వీడియోలో ఓ రెస్టారెంట్‌ లో ఓ లేడీ వెయిట్రస్‌ ఇద్దరు కస్టమర్లకు సర్వ్‌ చేస్తూ ఉంది. ఇంతలో వారిద్దరిలో ఓ వ్యక్తి ఆమె పై అరుస్తూ ఆమెను గాయపరచడానికి ప్రయత్నించాడు.

అంతే ఆమె ఒక్కసారిగా పంచ్‌ లు ఇస్తూ కాలితో బలంగా తన్నింది. దాంతో అతడు కిందపడిపోయాడు. ఇంతలో రెండో వ్యక్తి కూడా ఆమె మీద దాడికి దిగాడు. దాంతో ఆమె అతడిని కొట్టింది. ఆమె పైకి కుర్చీని విసిరాడు. కానీ ఆమె కాలితో ఒక్క కిక్‌ ఇవ్వగానే కిందపడిపోయాడు. అయితే ఈ ఘటన ఎప్పుడూ, ఎక్కడ జరిగింది అనేది స్పష్టత లేదు.

శనివారం సీసీటీవీ ఇడియట్స్‌ తన ఖాతాలో ఈ వీడియోను పోస్ట్‌ చేసి ఆమెను ” ఆడ బ్రూస్ లీ” అంటూ సంబోధించింది. ఈ క్లిప్‌ ను పోస్ట్‌ చేసినప్పటి నుంచి 34,000 కంటే ఎక్కువ లైక్‌ లను అందుకుంది.

చాలా మంది ఆమె చూపిన మార్షల్‌ ఆర్ట్స్‌ నైపుణ్యాలను మెచ్చుకుని ఆశ్చర్యం వ్యక్తం చేయగా మరికొందరు మాత్రం ఇది కావాలని తీసిన వీడియో లాగా ఉంది అంటూ సందేహించారు. ” రాబోయే బాట్‌వుమన్‌ సినిమాలోని సన్నివేశాలను ఇప్పుడే చూసినట్లుగా ఉందంటూ” ఓ వ్యక్తి వ్యాఖ్యానించారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

Hameed Shaik మనభారత్ న్యూస్