వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి - మర్రెడ్డి శ్రీనివాస్
వ్యాధులు-ప్రబలకుండా-చర్యలు-తీసుకోవాలి-మర్రెడ్డి-శ్రీనివాస్
మనభారత్ న్యూస్, 26 జూన్ 2024, ఆంధ్రప్రదేశ్, పిఠాపురం :- సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని పిఠాపురం నియోజకవర్గ ఇంఛార్జీ మర్రెడ్డి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నియోజకవర్గంలోని గోకివాడ గ్రామంలో పర్యటించిన మర్రెడ్డి శ్రీనివాస్ పలు సమస్యలను గుర్తించి వాటిని త్వరితగతిన పరిష్కరించేవిధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు తెలిపారు. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, దోమలు బెదడ ఎక్కువై మలేరియా, డయేరియా వంటి రోగాలు ప్రభలే అవకాశం ఉందన్నారు. తక్షణమే డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని కాకినాడ ఆర్డీఓ, పిఠాపురం ఎమ్మార్వోలకు మర్రెడ్డి శ్రీనివాస్ ఆదేశించారు. జనసేన నాయకులు దానం లాజర్బాబు, దేవరపల్లి చిన్నబాబు ఆయన వెంట వున్నారు.
What's Your Reaction?