వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థులు వీరే!
ysrcp mp candidates list for 2024 elections
మనభారత్ న్యూస్, 16 మార్చి 2024, ఆంధ్రప్రదేశ్ :- ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని నిర్ణయించుకున్న ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్... ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వేదికగా ఆ పనికి పూనుకున్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని నిర్ణయించుకున్న ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్... ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వేదికగా ఆ పనికి పూనుకున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు సామాజిక న్యాయం పాటిస్తూ జగన్ సీట్ల కేటాయింపు చేశారు. ఈ క్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అత్యధికంగా, గతంలో ఎన్నడూ లేదన్న విధంగా 50శాతం సీట్లు కేటాయించినట్లు ప్రకటించారు.
అవును... మైకందుకున్న ప్రతీసారీ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పుకునే వైఎస్ జగన్... చేతల్లోనూ అది నిరూపించుకునే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తుంది. ఈ సమయంలో ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది వైసీపీ. ఈ మేరకు సెంటిమెంట్ లో భాగమో, విశ్వసనీయతా కోణమో తెలియదు కానీ... గతంలో మాదిరిగానే ఎంపీ నందిగామ సురేష్.. వైసీపీ ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు.
తాజాగా ప్రకటించిన 25 ఎంపీ సీట్లకు గాను ఎస్సీలకు నాలుగు, బీసీలకు 11, ఎస్టీలకు ఒకటి, ఓసీలకు 9 సీట్లను కేటాయించారు. ఇదే సమయంలో 25మంది ఎంపీ అభ్యర్థుల్లోనూ 88శాతం మంది ఉన్నత విద్యావంతులే కాగా... అందులోనూ ఐదుగురు డాక్టర్లు, నలుగురు లాయర్లు, ఒక సీఏ, ఒక మెడికల్ ప్రాక్టీషనర్ ఉండటం గమనార్హం. ఈ క్రమంలో తాజాగా ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ఈ విధంగా ఉంది...!!
ఎంపీ అభ్యర్థులు - నియోజకవర్గాల వివరాలు:
శ్రీకాకుళం - పేరాడ తిలక్ - కళింగ (బీసీ)
విజయనగరం - బెల్లాన చంద్రశేఖర్ - తూర్పు కాపు (బీసీ)
విశాఖపట్నం - బొత్సా ఝాన్సీ లక్ష్మీ - తూర్పు కాపు (బీసీ)
అరకు - చెట్టి తనూజ రాణి - వాల్మీకి (ఎస్టీ)
కాకినాడ - చెలమశెట్టి సునీల్ - కాపు (ఓసీ)
అమలాపురం - రాపాక వరప్రసాద్ - మాల (ఎస్సీ)
రాజమండ్రి - డా. గూడురి శ్రీనివాసులు - శెట్టిబలిజ (బీసీ)
నరసాపురం - గూడూరి ఉమాబాల - శెట్టిబలిజ (బీసీ)
ఏలూరు - కారుమూరి సునీల్ కుమార్ - యాదవ (బీసీ)
మచిలీపట్నం - డా. సింహాద్రి చంద్రశేఖర్ రావు - కాపు (ఓసీ)
విజయవాడ - కేశినేని శీనివాస్ (నాని) - కమ్మ (ఓసీ)
గుంటూరు - కిలారి వెంకట రోశయ్య - కాపు (ఓసీ)
నరసరావు పేట - డా. అనీల్ కుమార్ యాదవ్ - యాదవ (బీసీ)
బాపట్ల - నందిగాం సురేష్ బాబు - మాదిగ (ఎస్సీ)
ఒంగోలు - చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి - రెడ్డి (ఓసీ)
నెల్లూరు - వేణుంకాబ విజయసాయిరెడ్డి - రెడ్డి (ఓసీ)
తిరుపతి - మద్దిల గురుమూర్తి - మాల (ఎస్సీ)
చిత్తురు - ఎన్ రెడ్డప్ప - మాల (ఎస్సీ)
రాజంపేట - పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి - రెడ్డి (ఓసీ)
కడప – వైఎస్ అవినాష్ రెడ్డి - రెడ్డి (ఓసీ)
కర్నూలు - బీవై రామయ్య - బోయ (బీసీ)
నంద్యాల - పోచ బ్రహ్మానందరెడ్డి - రెడ్డి (ఓసీ)
హిందూపూర్ - జోలదరసి శాంత - బోయ (బీసీ)
అనంతపురం - మాలగుండ్ల శంకర నారాయణ - కురుబ (బీసీ)
What's Your Reaction?