శిధిలావస్థ లో మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్

Jul 23, 2024 - 14:30
 0
శిధిలావస్థ లో  మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్

మనభారత్ న్యూస్, 23 జూలై  2024, ఆంధ్రప్రదేశ్, ఎన్ టి ఆర్ జిల్లా, తిరువూరు :--  శిధిలావస్థ లో  మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్.

పట్టణం లోని లక్ష్మీ సెంటర్లో 1987 సంవత్సరంలో నిర్మించిన సుంకర వీరభద్రరావు దుకాణ సముదాయం.

అప్పటి పంచాయతీ సర్పంచ్  కంచి రామారావు హయాంలో రూ. 5లక్షల వ్యయం తో  షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించగా ... నేడు అది ఎప్పుడు కూలి పోతుందో తెలియని ప్రమాదకర పరిస్థితిలో వుంది.

ఈ షాపింగ్ కాంప్లెక్స్ లోని 10దుకాణాల్లో నెలవారీ అద్దె ప్రాతిపదికన  వృత్తి, వ్యాపారాలు నిర్వహిస్తున్న దిగువ, మధ్య తరగతి ప్రజలు.

దుకాణాల్లో స్లాబ్ పెచ్చులు ఊడి పడుతుండటం,వర్షం కురిసిన సమయాల్లో పై నుండి నీరు లీకులు కావటం తో పాటు కురుస్తున్న యెడ తెరిపిలేని వర్షాలతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళన చెందుతున్న వ్యాపారులు.

దీనికి తోడు షాపింగ్ కాంప్లెక్స్ కు రెండు వైపులా కనీసం గేట్లు కూడా లేకపోవటం తో వర్షం వచ్చిందంటే  ఆవుల మంద రాత్రి వేళల్లో ఇక్కడే తిష్ట వేసి మల, మూత్ర విసర్జన చేస్తుండటం తో దుర్గంధం వ్యాపించి వ్యాపారులతో  పాటు దుకాణాలకు వచ్చే వినియోగదారులు సైతం ఇబ్బందులకు గురవుతున్నారు.

షాపింగ్ కాంప్లెక్స్ దుస్థితి పై గతం లో పలుమార్లు  అప్పటి ఎమ్మెల్యే రక్షణనిధి, మున్సిపల్ అధికారుల ద్రుష్టి కి తీసుకు వెళ్లినా తాత్కాలిక మరమ్మతులు కూడ చేయలేదని వాపోయిన వ్యాపారులు.

యేటా 7లక్షల రూపాయలు ఆదాయ వనరుగా వున్న దుకాణ సముదాయం సదుపాయాల పట్ల మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి తో విసుగు చెందిన వ్యాపారులు.

మున్సిపాలిటీ లో డబ్బులు లేవని అధికారులు చేతులెత్తేయటం తో తప్పని పరిస్థితుల్లో స్లాబ్ కు అనుసంధానం గా స్వంత ఖర్చుతో ఐరన్ రేకులు ఏర్పాటు చేసుకుని  బిక్కు బిక్కు మంటూ రోజులు గడుపుతున్న వ్యాపారులు.

రాష్ట్ర విభజన, కోవిడ్ విపత్కర పరిస్థితులు, వ్యాపారాలు సన్నగిల్లటం, ప్రధాన సెంటర్ కావటం, బహిరంగ మార్కెట్ లో షాపుల అద్దెలు అందుబాటులో లేకపోవటం వంటి కారణాలతో దిక్కు తోచని పరిస్థితుల్లో సొమ్ము పోయి శని పట్టే అన్న సామెతగా కనీస సౌకర్యాలు లేని మున్సిపల్ దుకాణాల్లో ఏళ్ళ తరబడి కష్ట, నష్టాల కోర్చి బ్రతుకు భారంగా వెళ్ళదీస్తున్నామని వాపోతున్న వ్యాపారులు.

ఇప్పటి కైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వ్యాపారులు కోరుతున్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

admin ManaBharat News