ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదగా పది లక్షల పోస్టల్ బీమా చెక్కు అందజేత..
మనభారత్ న్యూస్, 01 జూలై 2024, ఆంధ్రప్రదేశ్, పిఠాపురం :- తపాలా శాఖ అనుబంధ సంస్థ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు గ్రూప్ యాక్సిడెంట్లు కార్డు పాలసీ క్రింద ప్రమాద బీమా పరిహారం 10లక్షల రూపాయలు నమూనా చెక్కును సోమవారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదగా బాధిత కుటుంబానికి అందజేశారు. ఇటీవల పాలసీ తీసుకున్న వ్యక్తి కరెంటు స్తంభాలపై పనిచేస్తూ ప్రమాదవశాత్తు మరణించగా తన భార్య చిట్టితల్లికి పది లక్షల రూపాయల బీమా పరిహారం టాటా ఏఐ జి ద్వారా చెల్లించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తపాల శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సీనియర్ మేనేజర్ కె.రాజ్ కుమార్ మరియు మేనేజర్ యన్.బాలాజీ రాజు, మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.యస్.యన్.వర్మ, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, పిఠాపురం జనసేన కో ఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ ఇతర అధికారులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ తపాలా శాఖ అందిస్తున్న ఈ ప్రమాద బీమా సౌకర్యం ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తెలియజేశారు. ఈ పాలసీ సంవత్సరానికి 520 రూపాయలు కట్టుకుంటే ప్రమాదవశాత్తు మరణించిన వ్యక్తికి 10 లక్షలు ఇవ్వడం జరుగుతుందని, ప్రమాదం వలన హాస్పిటల్ వైద్య ఖర్చుల కొరకు లక్ష రూపాయలు వరకు బిల్లు చెల్లించడం జరుగుతుందన్నారు. అసంఘటితరంగ కార్మికులు, వివిధ వృత్తుల పనివారు ఈ అతి తక్కువ ప్రీమియంతో అందిస్తున్న పోస్టల్ బీమా సౌకర్యాన్ని అందరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు.
What's Your Reaction?