బిక్కుబిక్కుమంటున్న కోవీషీల్డ్ గ్రహీతలు

కొవీషీల్డ్‌ వ్యాక్సిన్‌ సైడ్‌ ఎఫెక్టులు కలిగిస్తుందని ఆస్ట్రాజెనికా కంపెనీ తొలిసారి అంగీకరించింది

Apr 30, 2024 - 15:48
 0
బిక్కుబిక్కుమంటున్న కోవీషీల్డ్ గ్రహీతలు

మనభారత్ న్యూస్, 30 ఏప్రిల్ 2024 :-  భారత్లో కొవాక్సిన్‌, కొవిషీల్డ్‌, స్పుత్నిక్‌-వి టీకాలు పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వం నేరుగా కొవాక్సిన్‌, కొవిషీల్డ్సేకరించి ప్రజలకు ఉచితంగా వేసింది. అటు ప్రైవేట్ఆస్పత్రులు కూడా వీటిని నేరుగా ఉత్పత్తిదారుల నుంచి సేకరించి నామమాత్రపు ధరకు అందించాయి. 

దేశంలో
దాదాపు 85 శాతం మంది కొవాక్సిన్లేదా కొవీషీల్డ్మాత్రమే తీసుకున్నారు. వీటిలో ఇప్పుడు కోవీషీల్డ్నుంచి భయంకరమైన వాస్తవం ఒకటి బయటపడింది.

తమ కంపెనీ తయారుచేసిన కొవీషీల్డ్వ్యాక్సిన్‌, సైడ్ఎఫెక్టులు కలిగిస్తుందని ఆస్ట్రాజెనికా కంపెనీ తొలిసారి అంగీకరించింది. కొవీషీల్డ్తీసుకున్నవాళ్లలో కొంతమందికి రక్తం గడ్డకడుతుందని, మరికొందరికి తెల్ల రక్తకణాలు (ప్లేట్లెట్స్‌) సంస్థ గణనీయంగా తగ్గిపోతుందని తెలిపింది సదరు కంపెనీ.

దీంతో దేశవ్యాప్తంగా వ్యాక్సిన్తీసుకున్నవాళ్ల వెన్నులో వణుకు మొదలైంది. అయితే సైడ్ఎఫెక్టు చాలా అరుదుగా మాత్రమే జరుగుతుందని తెలిపిన కంపెనీ, లక్ష మందిలో ఎంతమందిపై దుష్ప్రభావం చూపుతందనే లెక్కల్ని మాత్రం వెల్లడించలేదు.

కొవీషీల్డ్వ్యాక్సిన్వల్ల తాము ఎక్కువ సైడ్ఎఫెక్టుల బారిన పడ్డామంటూ బ్రిటన్లో పలువురు కోర్టుకెక్కారు. ఈ కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా ఆస్టాజెనికా కంపెనీ భయంకరమైన వాస్తవాన్ని బయటపెట్టింది.  కొవీషీల్డ్తీసుకోవడం వల్ల తాము తీవ్ర దుష్ప్రభావాలకు లోనైనట్టు బ్రిటన్కు చెందిన 51 మంది కోర్టులో కేసులు వేశారు. వీళ్లలో మొదట కేసు వేసిన వ్యక్తి జెమీ స్కాట్‌. వ్యాక్సిన్తీసుకోవడం వల్ల తను శాశ్వత మెదడు వాపు వ్యాధికి గురైనట్టు అతడు పేర్కొన్నాడు.

దీనికి సంబంధించిన విచారణలో భాగంగా కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లలో, ఆస్ట్రాజెనికా సంస్థ పై విధంగా స్పందించింది. రేర్కండిషన్స్లో తమ వ్యాక్సిన్వల్ల శరీరంలో రక్తం గడ్డ కడుతుందని తెలిపింది. ఆక్స్ఫర్ట్యూనివర్సిటీతో కలిసి వ్యాక్సిన్తయారుచేసింది ఆస్థ్రాజనికా.


వ్యాక్సిన్కు వరల్డ్హెల్త్ఆర్థనైజేషన్అనుమతినిచ్చింది. దీంతో సీరమ్ఇనిస్టిట్యూట్ఆఫ్ఇండియా, ఆస్థ్రాజనికాతో కలిసి భారీమొత్తంలో భారత్లో కొవీషీల్డ్ను ఉత్పత్తి చేసింది. వెంటనే కోట్లాది మందికి వ్యాక్సిన్ను ప్రభుత్వం అందించింది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

Hameed Shaik మనభారత్ న్యూస్