అమెరికాలో పేదలు- దుబాయిలో శ్రీమంతులు - తెలుగువాళ్లు

అమెరికాలో తెలుగు వాళ్లు అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేది ఐటీ నిపుణులు, డాక్టర్లు. దుబాయిలో తెలుగువాళ్లు అనగానే మైండుకి తట్టేది కార్మికులు, కష్టజీవులు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. సీన్ రివెర్స్ అవుతోంది.

Sep 23, 2023 - 09:05
Sep 23, 2023 - 09:33
 0
అమెరికాలో పేదలు- దుబాయిలో శ్రీమంతులు - తెలుగువాళ్లు

మనభారత్ న్యూస్, 23 సెప్టెంబర్ 2023, ఆంధ్రప్రదేశ్ :  

అమెరికాలో తెలుగు వాళ్లు అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేది ఐటీ నిపుణులు, డాక్టర్లు.
దుబాయిలో తెలుగు వాళ్లు అనగానే మైండుకి తట్టేది కార్మికులు, కష్టజీవులు. 

ఆయా దేశాలు తెలుగువాళ్ల దృష్టిలో అలా బ్రాండయిపోయాయి.

కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. సీన్రివెర్స్అవుతోంది.  అమెరికాలో స్థిరపడుతున్న తెలుగు వాళ్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే వీసాల విషయంలో ఒకప్పటి వెసులుబాటు, ఇప్పడు కఠినతరం చేసిన విధానం, మధ్యే మార్గాలు ఎన్నుకుంటున్న తెలుగువాళ్లు...ముందు వీటి గురించి చెప్పుకుందాం. 

సుమారు 20-25 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లాలంటే కన్సల్టెన్సీలు ముందుగా హెచ్‌1బి వీసా ఇప్పించేవి. అవును...ఉద్యోగం లేకపోయినా హెచ్‌1బి వీసా దొరికేది.

అప్పట్లో.  అలా హెచ్‌1బి వీసాలు పొందిన యువకుల్ని అమెరికాలో ఒక సిటీకి చేర్చి అక్కడొక జాయింట్అకామడేషన్లో ఉంచి నెమ్మదిగా ఉద్యోగ ప్రయత్నాలు చేయించేవి కన్ఫెల్టెన్సీలు. క్రమంగా ఉద్యోగాలు దొరికేవి. 

ఉద్యోగం దొరికే వరకూ ఆడ్జాబ్స్చేసేవాళ్లు తక్కువగానే ఉండేవాళ్లు. చేసినా చాలా తక్కువగా చేసేవాళ్లు. ఎందుకంటే పదిహేను ఇరవ మంది కలిసుండే జాయింట్అకామడేషన్కాబట్టి భారీగా డబ్బు సంపాదించాల్సిన అవసరం అంతగా ఉండేది కాదు. కనుక దృష్టంతా సంపాదించాల్సిన మంచి ఉద్యోగం మీదే ఉండేది. అలా ఉద్యోగం సంపాదించేవాళ్లు. తర్వాత పెళ్లి, ఇల్లు. నెమ్మదిగా 5-10 ఏళ్లళ్లో గ్రీన్కార్డ్సంపాదించుకుని బతికే సేవాళ్లు. 

కాలంలో చదువు కోసం అమెరికా వెళ్లే వాళ్ల సంఖ్య ఇప్పటితో పోలిస్తే చాలా తక్కువ. ఎక్కువగా హెచ్‌1బి జనాలే ఉండేవాళ్లు.  కానీ కాలక్రమంలో హెచ్‌1బి అంత ఈజీ కాకుండ పొయింది. ఉద్యోగం కోసం హెచ్‌1బి కాదు. ఉద్యోగం ఉంటేనే హెచ్‌1బి అని లెక్కలు మార్చేసింది అమెరికా. దాంతో ఎలాగైనా అమెరికా వెళ్లి స్థిరపడాలని కోరుకునే వాళ్లకి రెండే దారులు మిగిలాయి. 

ఒకటి- అమెరికా వెళ్లి చదువుకుని డిగ్రీతో నెమ్మదిగా అక్కడ ఉద్యోగం సంపాదించి హెచ్‌1బి పొందడం.

రెండు- ఇండియాలోనే మంచి ఐటీ ఉద్యోగం సంపాదించి కైడిబిలిటీ పెంచుకుని ఆన్ఫైట్పేరుతో అమెరికాలో ల్యాండవడం.

వీటిల్లో అబోవ్మిడిల్క్లాస్ఫ్యామిలీస్మొదటి దానికే ఆసక్తి చూపేవాళ్లు. ఎందుకంటే బ్యాంకులు ఎలాగూ ఎడ్యుకేషన్లోన్షిస్తాయి. మంచి అమెరికన్డిగ్రీ చేతిలో ఉంటే దేశంలో ఉద్యోగాలకి ప్రిఫరెన్స్ఎక్కువగా ఉంటుంది. పైగా విద్యార్థిగా గడిపే రెండేళ్లల్లో అమెరికా, భాష, వ్యవహారం అన్నీ అలవాటవుతాయి. కనుక అక్కడే ఉద్యోగం సంపాదించుకుని బ్యాంక్లోన్ని వాళ్లే తీర్చేసుకోవచ్చు అనే లెక్క ఉండేది.  బ్యాంకులు, లోన్లు విధానాల మీద పెద్దగా అవగాహన లేని మధ్యతరగతి వాళ్లు, ఉన్నా ధైర్యం చేయలేక ఉన్నంతలో ఇండియాలోనే మంచి ఉద్యోగం పొంది తర్వాత ఆన్సైట్లో వెళ్లేవాళ్లు. 

అన్నట్టు అప్పట్లో ఇంజనీరింగ్కాలేజీలు ఇండియాలో ఇప్పుడున్నంత విరివిగా ఉండేవి కావు. ఇంజనీరింగ్సీట్సంపాదించడమే కష్టమయ్యేది. ఇంజనీరింగ్పూర్తైతే తప్ప ఎమ్మెస్కోసం అమెరికా వెళ్లడం కష్టం కనుక అమెరికా కలల్ని సాకారం చేసుకునే యువత తక్కువగానే ఉండేది.  కానీ క్రమంగా పేటకొక ఇంజనీరింగ్కాలేజీ వెలిసింది. ఎంసెట్లో ర్యాంకొచ్చినా సీటు గ్యారెంటీ అయిపోయింది. కొన్ని చోట్ల ర్యాంకు రాకపోయినా నాలుగు రాళ్ళీస్తే సీటిచ్చే కాలేజీలు కూడా పుట్టుకొచ్చాయి. అలా ఏదో విధంగా ఇంజనీరింగ్పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి అమెరికా కల మొదలయ్యింది.  క్రమంగా వాళ్లని వీళ్ళని చూసి, ప్రతి ఇంట్లోంచి కనీసం ఒకడైనా అమెరికాలో స్థిరపడతుండడం గమనించి ఆల్మోస్ట్ప్రతి ఇంజనీరింగ్పూర్తైన విద్యార్థి యొక్క తల్లిదండ్రులూ తమ పిల్లల్ని అమెరికా పంపాలని డిసైడయిపోయారు.

కొన్నాళ్లు స్టూడెంట్వీసాలు రావడం కష్టంగా ఉండేది. ప్రయత్నించిన 10 మందిలో 6 గురికి రిజెక్టయ్యేవి. కానీ ఇండియన్స్కి అమెరికన్విద్య మీద ఉన్న వేలంవెర్రివల్ల తమ దేశానికి వందల మిలియన్డాలర్ల ఆదాయం వస్తోంది కనుక వచ్చిన వాడికి వచ్చినట్టు వీసాలు గుద్దడం మొదలుపెట్టారు.  మరి అమెరికన్కాలేజీలో అడ్మిషనంటే జి.ఆర్‌., టోఫెల్స్కోర్స్ఉండాలి కదా! దానికి 370% లు పుట్టుకొచ్చారు. డబ్బు పారేస్తే అన్ని స్కోర్లు వచ్చేస్తాయి. ( దీనిపై ఒక సమగ్ర కథనం ఇక్కడ చూడొచ్చు ).  కానీ మంది ఎక్కువైతే మజ్జిగ పల్బన అయినట్టు, అమెరికాకి విద్యార్థుల తాకిడి ఎక్కువయ్యి అక్కడ ఉద్యోగావకాశాలు తగ్గిపోయాయి. 

ఇప్పుడు అమెరికాలో చదివినంత మాత్రాన ఉద్యోగం రాదు. 10 మందిలో ఇద్దరికో ఉద్యోగం రావొచ్చు తప్ప తక్కిన వాళ్లంతా తిరిగి ఇండియా వెళ్లిపోవాల్సిందే.  ఇక్కడ నుంచి మనం చెప్పుకుంటున్న అసలు కథ.  అన్ని లక్షలు లోన్పెట్టుకుని అమెరికా వచ్చినవాళ్లు వెనక్కి వెళ్లే ఎలాగ? ఆందుకే ఆడ్జాబ్స్మీదే దృష్టి పెడుతున్నారు. 

దయనీయంగా టాయిలెట్స్కడగడం లాంటి జాబ్స్ని ఫుల్టైములో చేసుకుని బతుకీడుస్తున్నారు. వీసా ఎక్స్పైర్అయిపోయినా అక్కడే ఉండిపోతున్నారు. కొందరైతే సెలూన్పెట్టుకుని బార్బర్లుగా సెటిలైపోతున్నారు. ఆడపిల్లలైతే బేబీ కేర్పనులు, ఇంట్లో కసవు ఊడ్చడం లాంటి పనులు కూడా చేసుకోవడానికి దిగిపోతున్నారు. తాము చేసిన స్టడీ లోన్తీర్చాలంటే ఇంతకంటే వేరే మార్గం కనిపించట్లేదు వాళ్లకి. 

అమెరికాలో నిన్నటి వరకు ఇంట్లో పనిమనిషిని పెట్టుకోవడం కాస్ట్లీ ఎఫైర్‌. అలాగే డ్రైవర్ని మెయింటేన్చేయడం కూడా! ఎలెక్టీషియన్లు, ప్లంబర్లు కూడా కాస్ట్లీయే.  కానీ పనులన్నీ కొద్దో గొప్పో వచ్చిన మన తెలుగువాళ్లు అమెరికాలో బ్లూ కాలర్వృత్తులు చేసుకుంటూ మెక్కికన్లకి పోటీగా తయారవుతున్నారు. 

అడిగితే చూపించడానికి ఒక ఫేక్గ్రీన్కార్డుని కూడా దగ్గర పెట్టుకుంటున్నారు. ఫేక్గ్రీన్కార్డులు ప్రింట్చేసి ఇచ్చే కన్ఫెల్టైన్సీలు కూడా ఉన్నాయిప్పుడు.  రానున్న కొన్ని ఏళ్లళ్లో అమెరికాలో మెక్సికన్స్కంటే ఎక్కువగా ఇల్లీగల్తెలుగు ఇమ్మిగైంట్స్కనిపిస్తారు. వాళ్లంతా పాచిపని నుంచి కూలీ పని దాకా అన్ని రకాల పనులు చేసుకుంటూ ఉంటారు.

తెలుగు వాళ్లల్లో ఒకప్పటి దుబాయికున్న ఇమేజ్అమెరికాకి వస్తుంది. 

ఇక ఇప్పుడు దుబాయి విషయానికొద్దాం.


నిన్నటి
వరకు దేశం కేవలం తెలుగు కూలీలు, కష్టజీవులకి కేరాఫ్అడ్రస్‌.  చదువు రాకపోయినా కూలీ పనులకి, చిన్నా చితకా ఆడ్జాబ్స్కి, ఇంట్లో పనిమనుషులకి దేశం వీసాలిచ్చి ఇండియన్స్ని తీసుకెళ్లేది. ఇప్పటికీ తంతు జరుగుతూనే ఉంది. అయితే మధ్యన సంపన్నుల్ని ఆకర్షించే పని పెట్టుకుంది దుబాయి.  రియలెస్టేట్టూరిజం కి ఎప్పుడో తెర లేపినా, అక్కడ 4 కోట్ల రూపాయలు పెట్టి ప్రోపర్టీ కొంటే గోల్డెన్వీసా ఇస్తోంది. పదేళ్ల వరకు ఉండే గోల్డెన్వీసా అమెరికన్గ్రీన్కార్డుతో సమానం.


అయితే అమెరికన్గ్రీన్కార్డ్మాదిరిగా ఆర్నెల్లల్లో అమెరికా వచ్చిపోతుండడం లాంటి కండిషన్లేదు. పడేళ్లల్లో ఎప్పుడైనా రావొచ్చు, వెళ్లొచ్చు, అసలు రాకపోనూవచ్చు. తరహా వీసా ఉన్న వాళ్లకి దుబాయిలో రాజమార్గం. వాళ్లు దుబ్బాయిలో వ్యాపారాలు పెట్టుకున్నా, ఉద్యోగాలు చేసుకున్నా ట్యాక్స్అస్సలు కట్టక్కర్ణేదు. అది వేరే కథ. 


నిజానికి దుబాయిలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుని జీవించే రెసిడెంట్స్కూడా ప్రతి రెండేళ్లకొకసారి వీసాని రిన్యూ చేసుకోవాలి. కానీ గోల్డెన్వీసా అలా కాదు. పదేళ్లకొకసారే రిన్యూవల్‌. పైగా వీసా ఉన్నవాళ్లకి ఎసాద్కార్డ్రూపంలో ఎన్నో రాయితీలు కూడా ఉంటున్నాయి.  ఇదంతా కావాలంటే "నాలుగు కోట్ల పెట్టుబడా!" అని ఆశ్చర్య పోనక్కర్లేదు. ఎవడు పెడతార్లే అని పెదవీ విరవక్కర్లేదు.  ఎందుకంటే మొన్న పాం జుమేరాలో 20 కోట్ల నుంచి 40కోట్ల రూపాయల విలువగల విల్లాలు అమ్మేందుకు బుకింగ్స్ఓపెన్చేస్తే 40 డిగ్రీల వేడిలో భారతీయ, రష్యన్శ్రీమంతులు క్యూ కట్టి మరీ తొలి ఇన్స్టాల్మెంట్లు చెల్లించారు. వారిలో తెలుగువాళ్లు కూడా అనేకం.

 

ఇక 4 కోట్ల రూపాయల ప్లాట్స్‌, స్టూడియో అపార్ట్మెంట్స్‌ బిస్కెట్టుల్లా కొంటున్న తెలుగువాళ్ల లెక్క చెప్పక్కర్లేదు. హైదరాబాదులో రెండు ఫ్లాట్సో, విల్లాలో ఉన్నవాళ్లు కచ్చితంగా మూడోది దుబాయిలో కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు.  అంటే ఏమిటి? భారతీయ శ్రీమంతుల్లో చాలా మంది దుబాయిలో శాశ్వత నివాసం పొందుతున్నారు. లగ్జరీని అంతర్జాతీయ స్థాయిలో ఎంజాయ్‌ చేస్తున్నారు. దాంతో పాటు తమ ప్రోపెక్టీని టూరిజం పీక్‌ సీజనప్పుడు రెంటుకిచ్చుకుని మరింత సంపాదించుకుంటున్నారు. ఆ సంపాదనపై ట్యాక్స్‌ రాయితీ పొందుతున్నారు. దుబాయ్‌ గోల్డెన్‌ వీసా అనేది ప్రస్తుతం ఒక స్టాటస్‌ సింబల్‌ అయిపోయింది.  ఈ గోల్డెన్‌ వీసా మీద అవగాహన పెంచడానికి షారుఖ్‌ ఖాన్‌, కమల్‌ హాసన్‌, మోహన్‌ లాల్‌ ఇలా ఎందరో సినీ ప్రముఖులకి గోల్డెన్‌ వీసాలు పిలిచి ఇచ్చింది దుబాయ్‌.  కొందరు అర్హత ఉన్న ఆ స్థాయి వ్యక్తులు ఆర్డీ పెట్టుకుని గోల్డెన్‌ వీసా పొందుతున్నారు.  త్వరలో ఇలా అప్పణంగా ఇచ్చే వీసాలు ఆపేసి పూర్తిగా పెట్టుబడులు పెట్టే వారికే ఇచ్చే ఆలోచన చేస్తోందట.


దుబాయ్‌.  అంటే ఈ సెలెబ్రిటీలకి గోల్డెన్‌ వీసా ఇవ్వడమనేది తాత్కాలికం మాత్రమే.  ఇదంతా చెప్పడం దేనికంటే ఆయా దేశాల విధానాల వల్ల అమెరికా, దుబాయిలు తమ ఇమేజ్‌ ని తారుమారు చేసుకుంటున్నాయి. 

 

దుబాయి భారతీయ శ్రీమంతులుండే ప్రాంతంగా, అమెరికా భారతీయ కార్మికులుండే దేశంగా ముద్ర వేసుకుంటున్నాయి. 


సరే..దుబాయ్‌ సంగతి పక్కనపెట్టి తెలుగు విద్యార్థులకి చెప్పే సలహా ఒక్కటే. అమెరికా కలలు కనడం తగ్గించండి. వేరే దేశాలపై దృష్టి పెట్టండి. ఏ దేశలని అడుగుతారేమో!  తెలివైన వాళ్లైతే ఎక్కడ యూత్‌ పాపులేషన్‌ తక్కువగా ఉండి ఓల్టేజ్‌ పాపులేషన్‌ ఎక్కువగా ఉంటుందో ఆ దేశాల్ని ఎన్నుకోవాలి.  ఉదాహరణకి జెర్మనీ ఆ స్థితిలో ఉంది. ఆ దేశంలో విద్యా, ఉపాధి మీద దృష్టి పెడితే విదేశీ జీవితం సుందరస్వప్నంగా ఉండొచ్చు. అయితే జెర్మన్‌ నేర్చుకోవాలి, కాస్తంత కష్టపడాలి!  ఇలా చాలా దేశాలు దొరకొచ్చు. స్వయంగా రీసెర్చ్‌ చేసుకుని అడుగువెయాలి.

 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

admin ManaBharat News