వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి గా ఇంటూరి రాజగోపాల్
ఉత్తర్వులు జారీ చేసిన అధిష్టానం
మనభారత్ న్యూస్ ప్రతినిధి, 11 అక్టోబరు 2024, జగ్గయ్యపేట, ఆంధ్రప్రదేశ్ : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఇంటూరి రాజగోపాల్ (చిన్నా) ను నియమిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు మంజూరు అయ్యాయి. పార్టీ కేంద్ర కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో ఎన్టీఆర్ జిల్లా నుంచి ఇంటూరి రాజగోపాల్ ను కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులను వె వరించారు. ఈ సందర్భంగా ఇంటూరి చిన్న మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా తనను నియమించినందుకు పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి తన వంతు కృషి చేస్తానని జగన్మోహన్ రెడ్డి తనపై నమ్మకంతో తనకు ఇచ్చిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తూ పార్టీ ఉన్నతికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఇంటూరి చిన్న తెలిపారు.
What's Your Reaction?