డాలర్ డ్రీమ్స్

Apr 19, 2024 - 21:04
 0  6
డాలర్ డ్రీమ్స్

మనభారత్ న్యూస్, 19 ఏప్రిల్ 2024,  న్యూ ఢిల్లీ :- మన ఆంధ్రకు చెందిన ఇద్దరు అమ్మాయిలు అమెరికాలో షాపులో దొంగతనం చేస్తూ దొరికిపోయారు.. పోలీసులు అరెస్టు చేసి జడ్జి దగ్గరకు పంపించారు..

మనం అనుకున్నట్లు అమెరికాలో అన్ని యూనివర్సిటీలలో కూడా అత్యధికమైన నాణ్యత ప్రమాణాలతో చదివే  విశ్వవిద్యాలయం లు ఉండవు..అక్కడ కూడా అరకొరా చదివించే చిన్నచిన్న యూనివర్సిటీలు ఉంటాయి.. అవి కేవలం మన విద్యార్థుల కట్టే ఫీజు కోసమే కోర్సులను ఆఫర్ చేస్తాయి.. 

ఇక భారత దేశంలో సగటు తల్లిదండ్రులు పక్క ఇంటి వాళ్ళని చూసి ఎదురింటి వాళ్ళ గొప్పలు  చూసి మా కూతురు న్యూయార్క్ లో ఉంది మా అల్లుడు డల్లాస్ లో ఉన్నాడు కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు ఆ డబ్బులతో మేము ఇక్కడ పొలాలు కొంటున్నాము అని చెప్పడం విని ప్రతి ఒక్కరూ ఆశపడి తమ పిల్లలను అమెరికాకు పంపించాలి అని అనుకుంటారు..

ఇక చూసుకో అసలు కథ మొదలవుతుంది.. మన పిల్లలకు అంత పరిజ్ఞానం ఉండదు.. ఆ GRE, టోఫెల్  లాంటి పరీక్షలు కూడా దొంగ దొంగగా సర్టిఫికెట్లు తెచ్చుకునే పద్ధతులు ఉన్నాయి.. ఇక ఒక 50 లక్షలు బ్యాంకు గ్యారంటీ చూపించి పిల్లలను ఎలాగోలా అమెరికాకు పంపిస్తారు.. కానీ అక్కడ జీవన విధానం కొంచెం కాస్ట్లీ గా ఉంటుంది.. వాళ్లకు కావలసినంత డబ్బులు పంపించలేరు..అక్కడ పెట్రోల్ బంకుల్లో రెస్టారెంట్లలో కొంచెం పార్టు టైం పని చేసుకుంటూ ఉంటారు.. చాలా అంది అక్కడికి వెళ్లడం వలన ఇప్పుడు చిన్న చిన్న ఉద్యోగాలు కూడా దొరకడం లేదట... అంతేకాకుండా కొందరికి సరదాగా దొంగతనం చేయాలని లేదా కనుక్కోలేరులే కనుక్కున్న ఇండియాలో మాదిరి బుకాయించొచ్చు అని ఇలా చిన్నచిన్న దొంగతనాలు చేస్తూ ఉంటారు..

ఇలా పట్టుబడితే వాళ్ల డేటా బేస్ లో ఎంటర్ అయితే తర్వాత ఎటువంటి ఉద్యోగము ఇవ్వరు.. తర్వాత వాళ్లే మరలా అమెరికా వెళ్లాలన్న కష్టమే.. చాలాసార్లు వాళ్లు దయ తలచి వదిలేస్తూ ఉంటారు కానీ రిపీటెడ్ గా చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పేస్ రికగ్నిషన్ సిస్టం ద్వారా కనుక్కొని ఇప్పుడు శిక్షలు విధిస్తున్నారు...

ఇప్పుడు అమెరికాలో కూడా ఉద్యోగాలు దొరకడం చాలా కష్టం.. వాళ్లు కోర్సు  అయిపోయిన తర్వాత రెండేళ్లు ఏదో ఒక పని చేసుకుంటూ ఉండొచ్చు.. అంత లోపల హెచ్1బి వీసా వస్తే అక్కడ పనిచేసేకి ఉంటుంది.. ఇది తప్పించుకోవడానికి అక్కడ మరలా ఇంకొక కోర్సు చేరడం చేస్తూ ఉంటారు.. చాలామంది ఇక్కడికి రాలేరు అక్కడ ఉద్యోగం రాదు.. ఈ విధంగా త్రిశంకు స్వర్గంలో బతుకుతూ ఉంటారు.. ఇక్కడ పేరెంట్స్ ఏమో మా వాళ్ళు ఏదో మంచి ఉద్యోగం చేస్తున్నారు అని అనుకుంటు ఉంటూ మా పిల్లలకు కోటి రూపాయల ప్యాకేజీ రెండు కోట్లు ప్యాకేజీ అని డబ్బా చెప్పుకుంటూ ఉంటారు...

అక్కడ వీరికి వచ్చే అరాకొరా జీతంతో బతకడం కష్టం..తర్వాత లైఫ్ లగ్జరీగా ఏమి ఉండదు. అక్కడ పని మనుషులు ఏమీ ఉండరు.. పిలిస్తే పలికేకి ఎవరూ ఉండరు.. బాగా మంచి ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్స్ ఉండి మంచి ఉద్యోగం సంపాదించుకునే కెపాసిటీ ఉన్నవాళ్లు వెళితే అర్థం ఉంది గాని ప్రతి ఒక్కరు వేలం వెర్రిగా దానికి ఎగబడడం అనేది అంత మంచిది కాదు..మన భారత దేశంలోనే మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు.. అంతేకాకుండా పేరెంట్స్ దగ్గరగా ఉంటారు వాళ్లకు ఏమీ కావాల్సి వచ్చినా గాని చూసుకుంటారు.. 

అదే మన ఇండియాలో షాప్ లో దొంగతనం చేసి ఉంటే ఈపాటికి ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్లకు ఫోన్లు చేసి బెదిరించే వాళ్ళు..టీవీలలో డిబేట్లో పేపర్లలో అదేమన్నా పెద్ద విషయమా అని దబాయించి ఆ షాప్ నే ముగించేవాళ్ళు లేదా ఆ పోలీసులను సస్పెండ్ చేపించేవాళ్ళు..

ఎంతైనా మన దేశంలో ఉన్న మన అడ్వాంటేజ్ వేరే దేశంలో ఉండదు నోరు మూసుకొని జైలుకు పోవాల్సిందే... 

అందుకనే జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి..అంటే కన్నతల్లి పుట్టిన ఊరు స్వర్గం కంటే గొప్పది..

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

Hameed Shaik మనభారత్ న్యూస్