పట్టాదారు పాస్ పుస్తకాలపై చంద్రబాబు కీలక నిర్ణయం ! ఇకపై ఇలా..!
పట్టాదారు-పాస్-పుస్తకాలపై-చంద్రబాబు-కీలక-నిర్ణయం-ఇకపై-ఇలా
మనభారత్ న్యూస్, 26 జూన్ 2024, ఆంధ్రప్రదేశ్, విజయవాడ :- ఏపీలో రైతులకు ఇచ్చే పట్టాదారు పాస్ పుస్తకాలపై కొత్త కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై తాజా నిర్ణయం ప్రకటించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ ఫొటోతో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. ఈ నేపథ్యంలో ఇకపై పట్టాదారు పాస్ పుస్తకాల విషయంలో కొత్త విధానం అమలు కానుంది. కుప్పం పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు పట్టాదారు పాసు పుస్తకాలపై ఇవాళ కీలక ప్రకటన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పట్టాదారు పాసు పుస్తకాలను మారుస్తామని గతంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా మార్పులు చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో తొలిసారి అప్పటి సీఎం జగన్ బొమ్మతో ఈ పుస్తకాలను పంపిణీ చేశారు. దీనిపై అభ్యంతరాలు వచ్చినా అప్పట్లో పట్టించుకోలేదు. దీంతో ఇప్పుడు ఆ బొమ్మను తీసేసి రాజముద్ర పెడతామని చంద్రబాబు ప్రకటించారు. మీ తాత ముత్తాతలు సంపాదించిన భూమికి ఇచ్చే పాస్ పుస్తకంపై గత ప్రభుత్వం జగన్ బొమ్మ వేసుకుందని ప్రజలతో చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇప్పుడు భూమికి తన బొమ్మ వేసుకోవాలా అని వారిని ప్రశ్నించారు. తాను అలా వేసుకోనని, అన్ని పట్టాదారు పాస్ పుస్తకాలనూ మారుస్తానని తెలిపారు. బొమ్మ తీసేస్తానని, రాజముద్రతో మీ భూములు మీకు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. త్వరలో ఈ మేరకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
What's Your Reaction?