కాంగ్రెస్ కోసం ఓటుకు 12 వేలు.! రంగంలోకి చంద్రబాబు సన్నిహితుడైన నిర్మాత!
ఈ క్రమంలో టాలీవుడ్ కి చెందిన ఒక ప్రొడ్యూసర్ ఏపీ - తెలంగాణ బోర్డర్ లో డబ్బు తరలింపు కార్యక్రమాలు చేపట్టారనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి
మనభారత్ న్యూస్, 29 నవంబరు 23, హైదరాబాద్ : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం నిన్నటితో ముగిసింది. రేపు రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగబోతుంది. ఈ సమయంలో తెలంగాణలో ధన ప్రవాహం కెరటాలు వేస్తూ పరుగులు పెడుతుందనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటుకు భారీ స్థాయిలో నోటు ఇస్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో టాలీవుడ్ కి చెందిన ఒక స్టార్ ప్రొడ్యూసర్ వ్యవహారంపై చర్చ జరుగుతుంది.
అవును... తెల్లారితే తెలంగాణ రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీనికోసం ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారని చెబుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ కి చెందిన ఒక ప్రొడ్యూసర్ ఏపీ - తెలంగాణ బోర్డర్ లో డబ్బు తరలింపు కార్యక్రమాలు చేపట్టారనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి.
మరో ఇద్దరు నిర్మాతలతో కలిసి సినీ నిర్మాణ సంస్థను స్థాపించిన ఆ స్టార్ ప్రొడ్యూసర్ టాలీవుడ్ లో చాలా మంది హీరోలతో సినిమాలు నిర్మించారు. ఇదే సమయంలో... టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా కూడా సదరు నిర్మాతకి పేరుందని చెబుతుంటారు. ఈ సమయంలో ఏపీ-తెలంగాణ బోర్డర్ లోని జిల్లాల్లో కీలకమైన నియోజకవర్గాల్లో ఇతని టీం డబ్బులు పంచుతున్నారని సమాచారం!
ఇందులో భాగంగా చంద్రబాబుకు సన్నిహితుడైన ఈ నిర్మాత.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం భారీగా నగదు పంచుతున్నారని అంటున్నారు. ఈ క్రమంలో ఒక్కో ఓటుకు సుమారు 12 వేల రూపాయలు పంచుతున్నారని తెలుస్తుంది. దీంతో... తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కోసం చంద్రబాబు తన అనుచరులను, ఆత్మీయులను రంగంలోకి దింపారనే కామెంట్లు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.
కాగా... తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలపరచాలని.. పరోక్షంగా రేవంత్ రెడ్డి నాయకత్వానికి తనవంతు సహాయ సహకారాలు అందించాలని.. అందువల్లే ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని చంద్రబాబు నిర్ణయించారని విమర్శలు వినిపించిన సంగతి తెలిసిందే! ఈ క్రమంలోనే ఆర్ధికంగా కూడా చంద్రబాబు.. తెలంగాణ కాంగ్రెస్ కు, రేవంత్ కు తన వంతు చేయుతని అందిస్తున్నట్లున్నారనే చర్చ తాజాగా మొదలైంది. మరి ఈ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది.. ఈ వ్యవహారంపై ఇతర పార్టీల నేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తారా.. చేస్తే ఈసీ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఆసక్తిగా మారింది.
What's Your Reaction?