బీఆర్ఎస్ దీక్షా దివస్
ఎన్నికల పోలింగ్‌కు ముందు రోజు బీఆర్ ఎస్ .. నిర్వహిస్తున్నదీక్షా దివస్‌పై కాంగ్రెస్ నాయకులు మౌనం పాటించారు.
మనభారత్ న్యూస్, 29 నవంబరు 23, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 24 గంటలు కూడా లేని సమయంలో అధికార పార్టీ బీఆర్ ఎస్ రాష్ట్ర వ్యాప్తం గా 'దీక్షా దివస్'కు పిలుపునిచ్చింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు.. జిల్లాలు, మండల స్థాయిలో రక్తదాన శిబిరాలు నిర్వహించాలని.. తెలంగాణ ఉద్యమం.. నాటి పరిస్థితులను మననం చేసుకోవాలని పిలుపుని చ్చింది. అంతేకాదు.. తెలంగాణ అభివృద్ధికి కట్టుబడతామని ప్రతిజ్ఞ చేయాలని కూడా.. కార్యకర్తలకు ఆదేశౄలు జారీ చేసింది.
ఇక, హైదరాబాద్‌లో అమరవీరుల స్థూపానికి బీఆర్ ఎస్ నాయకులు నివాళి అర్పించారు. ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన దీక్షా దివస్ రక్తదాన శిబిరంలో మంత్రి కేటీఆర్ పాల్గొని రక్త దానం చేశారు. దీనికి సంబం ధించిన విజువల్స్‌ను ఆయన సోషల్ మీడియాకు రిలీజ్ చేశారు. మరోవైపు.. కార్యకర్తలు కూడా రక్తదానం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా, సీఎం కేసీఆర్.. తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్రం కోసం ఆమరణ దీక్ష చేపట్టి నేటికి 15 ఏళ్లు పూర్తయ్యాయి.
అప్పట్లో నవంబరు 29న ఆయన దీక్ష చేపట్టారు. దీనిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం బీఆర్ ఎస్ నాయకులు 'దీక్షా దివస్' పేరుతో నవంబరు29న పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే.. ఈ ఏడాది ఎన్నికల సందడి రావడంతోపాటు.. ఖచ్చితంగా ఈ దీక్షా దివస్‌కు ముందు రోజు.. పోలింగ్ కూడా ఉండడంతో బీఆర్ ఎస్ ఈ రోజును తమకు అనుకూలం చేసుకుని.. చాకచక్యంగా మలుచుకుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదిలావుంటే.. ఎన్నికల పోలింగ్‌కు ముందు రోజు బీఆర్ ఎస్ .. నిర్వహిస్తున్నదీక్షా దివస్‌పై కాంగ్రెస్ నాయకులు మౌనం పాటించారు. ఈ కార్యక్రమం ఎన్నికల పోలింగ్‌పై ప్రభావం చూపుతుందని నాయకు లు అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నా.. పైకి మాత్రం నోరు విప్పడం లేదు. నిజానికి ఏం జరిగినా.. వెంటనే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నా.. తాజా దీక్షా దివస్‌పై మాత్రం పదవి విప్పే పరిస్థితి లేకుండా పోయింది.
What's Your Reaction?