కీసర టోల్ ప్లాజా చట్ట విరుద్ధం అంటూ హైకోర్టు లో కేసు
మనభారత్ న్యూస్, 08 మే 2023, ఎన్టీఆర్ జిల్లా : నందిగామ (W.P(PIL) - 60/2022) సోమవారం ఏపీ హైకోర్టులో చీఫ్ జస్టిస్ ధర్మాసము ముందు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన కీసర విలేజ్ వద్ద ఉన్న స్వర్ణ టోల్ వేస్ ప్రైవేట్ లిమిటెడ్ టోల్ ప్లాజా పై ప్రముఖ హైకోర్టు, సుప్రీం కోర్ట్, న్యాయవాది , మరియు తెలుగు రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జై భీమ్ శ్రీనివాస్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం హైకోర్టులో కేసు వేసినారు.
ఈరోజు చీఫ్ జస్టిస్ ధర్మాసము ముందు జై భీమ్ శ్రీనివాస్ వాదనను వినిపిస్తూ , నేషనల్ హైవే చట్టం ప్రకారం ,
రెండు టోల్ గేట్లు మధ్య కనీస దూరం 60 కిలోమీటర్లు ఉండాలని చెబుతుంది చట్టం అంటూ , మరియు కీసర వద్ద ఏర్పాటు చేసిన స్వర్ణ టోల్ వేస్ ప్రైవేట్ లిమిటెడ్ (Toll Plaza) టోల్ ప్లాజా చట్ట వ్యతిరేకంగా మరియు నేషనల్ హైవే చట్టానికి వ్యతిరేకంగా , స్వర్ణ టోల్ వేస్ ప్రైవేట్ లిమిటెడ్ (Toll Plaza) టోల్ ప్లాజా ఎస్టాబ్లిష్ చేస్తూ అక్కడ ప్రజల నుంచి చట్ట వ్యతిరేకంగా డబ్బులు వసూలు చేస్తున్నారంటూ,
జై భీమ్ శ్రీనివాస్ వాదనలు వినిపించడం జరిగింది . జై భీమ్ శ్రీనివాస్ వాదనలు హైకోర్టు వారు పరిగణలో తీసుకొని, ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం లో ఉన్న ప్రతివాదులు అందరికీ నోటీసులు జారీ చేయమని హైకోర్టు వారు ఆర్డర్ వేయడం జరిగింది మరియు ప్రత్యేకంగా ఎన్టీఆర్ జిల్లా , కీసర విలేజ్ వద్ద ఉన్న స్వర్ణ టోల్ వేస్ ప్రైవేట్ లిమిటెడ్ Toll Plaza వారికి పర్సనల్ నోటీస్ (వ్యక్తిగత నోటీసులు) జారీ చేయమని హైకోర్టు వారు ఆర్డర్ ఇచ్చియున్నారు.
What's Your Reaction?