అగ్ని ప్రమాద బాధితులకు బద్రి ఆర్ధిక సాయం
అగ్ని ప్రమాద బాధితులకు బద్రి ఆర్ధిక సాయం
మనభారత్ న్యూస్, 26 జూన్ 2024, ఆంధ్రప్రదేశ్, పిఠాపురం :- పిఠాపురం నియోజకవర్గం కొడవలి గ్రామంలో పోలవరపు చందర్రావు ఇంట్లో గ్యాస్ పేలుడు సంభవించి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న పిఠాపురం నియోజవర్గం జనసేన పార్టీ బీసి నాయకుడు నక్కా శ్రీనివాస్ (బద్రి) బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబానికి నక్కా శ్రీనివాస్ (బద్రి) రూ.5వేలు ఆర్ధిక సాయం ఆందజేశారు. వారితో మాట్లాడి ప్రభుత్వం తరపున తమ కుటుంబానికి అన్ని విధాలా సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొడవలి జనసేన పార్టీ అధ్యక్షుడు నక్కా నారాయణమూర్తి, గొల్లప్రోలు మండల ప్రెసిడెంట్ అమరాది వల్లి రామకృష్ణ, మాజీ సర్పంచ్ సారిపిల్లి నాగేశ్వరరావు, వీర మహిళ కేతీనిడి గౌరీ, గరగ తాతాజీ, గొల్లపల్లి గంగబాబు, సుబ్బు, బాబులు, జనసైనికులు మొరుకుర్తి ఏసుబాబు, కొయ్య శ్రీనివాస్, నక్కా ప్రకాష్, పీర్ల నాగార్జున, అంజలపు రమేష్, నక్కా శివ, కుక్క ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?