కార్పొరేట్ కు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు
మనభారత్ న్యూస్, NTR జిల్లా / జగ్గయ్యపేట టౌన్, 11-07-2023(మంగళవారం) : దేశ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన సంస్కరణలు చేపట్టారని,తద్వారా కార్పొరేట్ దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను గారు అన్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో వైద్యం, ఆరోగ్యం రెండు కళ్ళుగా అత్యంత ప్రాధాన్యతిస్తూ ఆయా రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు శ్రీమతి విడదల రజిని గారు అన్నారు.
ఈ సందర్భంగా మంగళవారం నాడు జగ్గయ్యపేట పట్టణం నందు 3 కోట్ల రూపాయలతో ప్రభుత్వ హాస్పటల్ నందు నూతనంగా నిర్మించిన భవనం నందు ఓపి బ్లాక్ మరియు ఓటీ బ్లాక్ వార్డులు,30 నుండి 50 పడకల ఆసుపత్రిగా ప్రారంభం,తోర్రగుంట పాలెం నందు 90 లక్షల రూపాయలతో పట్టణ ఆరోగ్య కేంద్రం, బలుసుపాడు రోడ్డు జగనన్న లేఔట్ నందు మరొక 90 లక్షల రూపాయలతో పట్టణ ఆరోగ్య కేంద్రలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీమతి విడదల రజనీ గారు ప్రభుత్వవిప్ శాసనసభ్యులు సామినేని ఉదయభాను గారితో కలిసి ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను గారి అధ్యక్షతన జరిగిన సభా కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీమతి విడదల రజనీ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.జగ్గయ్యపేటలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో స్థానిక ఎమ్మెల్యే ఉదయభాను గారి కృషితో 3 కోట్ల రూపాయలతో జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిని వివిధ విభాగాలను ఏర్పాటు చేయడం,ఆసుపత్రి స్థాయిని 30 పడకల నుండి 50 పడగలకు పెంచడం,అదనపు భవనం నిర్మించడం,2 నుండి 1 1 మంది వైద్యలు పెంచడం అభినందనీయమన్నారు.జగ్గయ్యపేట ప్రాంత అభివృద్ధికి ఉదయభాను గారు చేస్తున్న కృషి స్ఫూర్తిదాయకం అన్నారు.
ఈ సందర్భంగా ఉదయభాను గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సహకారంతో పట్టణంలో ఉన్న 16 వేల కుటుంబాలకు మంచి ఆరోగ్యాన్ని అందించాలనే సదుద్దేశంతో మూడు కోట్ల రూపాయల నాబార్డు నిధులతో జగ్గయ్యపేట ప్రభుత్వ హాస్పిటల్ ను పూర్తిగా రూపురేఖలు మార్చేశామన్నారు. పై అంతస్తు ఏర్పాటుచేసి సుశాలమైన వివిధ విభాగాలను ఏర్పాటు చేశామన్నారు.అలాగే గతంలో ఉన్న ఇద్దరు డాక్టర్ల నుండి 11 మంది డాక్టర్లుగా పెంచడమే కాకుండా అధునాతనమైన సాంకేతిక వైద్య పరికరాలను ఏర్పాటు చేయడం, 30 పడకల నుండి 50 పడకలకు పెంచడం వంటి సంస్కరణలను చేపట్టడం జరిగిందన్నారు.అలాగే ప్రతి 25వేల మంది జనాభాకు మరింత వైద్య సేవలను అందించేందుకు వారు ఉన్న ప్రాంతంలోనే స్థానిక తొర్రగుంటపాలెం లో 90 లక్షల రూపాయలతో ఒక అర్బన్ హెల్త్ సెంటర్ మరియు బలుసుపాడు రోడ్డు జగనన్న కాలనీలో మరొక 90 లక్షల రూపాయలతో అర్బన్ హెల్త్ సెంటర్ ను ఏర్పాటుచేసి పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు.గత చంద్రబాబు పాలనలో ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలలు అధ్వానంగా ఉండేవని మన జగనన్న పాలనలో నాడు నేడు ద్వారా ప్రభుత్వ హాస్పిటల్స్ తో పాటు పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నారన్నారు. ఇతర రాష్ట్రాల వారు కూడా మన రాష్ట్రంలో జరుగుతున్న నాడు నేడు ద్వారా జరుగుతున్న అభివృద్ధిని చూసి తమ రాష్ట్రంలో అమలు చేసుకోవాలని సర్వే చేసి వెళ్తున్నారని అన్నారు.రాబోయే నాలుగు మాసాలలో టిడ్కో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి ప్రజలకి అందిస్తామన్నారు,అనంతరం ఇద్దరు డాక్టర్లను మరియు బ్లడ్ బ్యాంకు చేయవలసిందిగా మంత్రి రజిని గారికి వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, నియోజకవర్గ పార్టీ యువ నాయకులు సామినేని వెంకటకృష్ణ ప్రసాద్ బాబు,కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు,మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర,వైస్ చైర్మన్లు తుమ్మల ప్రభాకర్,హఫీజున్నిసా ఫిరోజ్ ఖాన్,మార్కెట్ యార్డ్ చైర్మన్ ముత్తినేని విజయ శేఖర్,పార్టీ పట్టణ అధ్యక్షులు ఆకుల శ్రీకాంత్ బాజీ, యువజన విభాగం అధ్యక్షులు ఆవాల భవాని ప్రసాద్,సీనియర్ నాయకులు వేల్పుల రవికుమార్, రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు,విజయవాడ దుర్గగుడి డైరెక్టర్లు,జడ్పిటిసిలు,ఎంపీపీలు,మండల పార్టీ అధ్యక్షులు,పట్టణ అనుబంధ విభాగాల అధ్యక్షులు,పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు,హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు కటారి హరిబాబు,అక్బర్ ఖాన్,తుమ్మల నాగమణి,డిసిహెచ్ఎస్ స్వప్న,డి ఎం హెచ్ ఓ సుహాసిని,జాయింట్ కమిషనర్ సరళమ్మ, సూపర్డెంట్ హరీష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు,అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
What's Your Reaction?