వైన్ షాపులో నిల్... బెల్ట్ షాపులో ఫుల్.
మనభారత్ న్యూస్, బొనకాలు . : సిండికేట్ దందా లో బోనకల్లు వైన్ షాపు యాజమాన్యం....
ప్రతి ఒక్క మద్యం బాటిల్ పై 15 రూపాయలు చొప్పున, అధిక ధరలకు అమ్మకం చేస్తున్నారు బోనకల్ వైన్ షాప్ యాజమాన్యం*
చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న ఎక్స్చేంజ్ స్థానిక అధికారులు ?
ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలో గల వైన్ షాపులో కొత్త తరహాలో సిండికేట్ దందా నడుస్తుంది...
అసలే ఎండాకాలం అటుపై భానుడి ప్రతాపం ఎండలో తిరిగి అలసి వస్తున్న మద్యం ప్రియులు చల్లటి బీరు తాగుదామని వైన్ షాప్ కి వెళితే అక్కడ చేదు అనుభవం ఎదురవుతుంది.*వైన్ షాపులో బీర్లు, కోటర్ సీసాలు దొరకవు బెల్టు షాపులో ఉంది అక్కడ పోయి తాగండి అనే సమాధానం వినిపిస్తుంది* సరేనని బెల్ట్ షాపులకు ఆశ్రయించగా 160 రూపాయల గల బీరు 210 అంటూ విక్రయిస్తున్న వైనం బోనకల్లు మండలంలో ఏర్పడింది.
బెల్టు షాపు యజమాన్యాన్ని వివరణ కోరగా మాకు వైన్ షాప్ యజమాన్యం వారే 170 రూపాయల చొప్పున విక్రయించగా మేము 210 కు విక్రయిస్తున్నట్లు సమాధానం ఇచ్చారు.
*బోనకల్లు మండలంలో బోనకల్లు గ్రామంలో పాటు వివిధ గ్రామాలలో బెల్ట్ షాపులు పుట్టగొడుగుల వెలుస్తున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు* రాష్ట్రవ్యాప్తంగా బెల్ట్ షాపులకు అనుమతి లేదు, బెల్ట్ షాప్ లో ఫుల్ బాటిల్ మందును విక్రయించకూడదు. ఈ నిబంధనను తుంగలో తొక్కి *బెల్టు షాపులో ఫుల్ బాటిల్ అధిక మొత్తంలో మందును విక్రయిస్తూ అధిక సొమ్మును బోనకల్ వైన్స్ యాజమాన్యం,కాజేస్తున్న వైనం వివిధ గ్రామాలలో ఏర్పడుతుంది.*
ఇకనైనా స్థానిక అధికారులు స్పందించి బోనకల్ వైన్ షాపు యాజమాన్యం నియమ నిబంధనల ప్రకారం మద్యం MRP ధరలకే విక్రయించేలా, బోనకల్ మండలంలోని బెల్టు షాపులను అరికట్టేలా కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
What's Your Reaction?