ఐపీఎల్ లోకి కొడుకు ఎంట్రీ.. సచిన్ ఎమోషనల్ సందేశం
అర్జున్ ఈ రోజు నువ్వు క్రికెటర్గా నీ ప్రయాణంలో మరో ముఖ్యమైన అడుగు వేశావు
మనభారత్ న్యూస్, 17 ఏప్రిల్ 2023 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోకి సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఎంట్రీ ఇచ్చాడు. కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2023లో ముంబై ఇండియన్స్ తరఫున అర్జున్ టెండూల్కర్ అరంగేట్రం చేయడంతో సచిన్ మురిసిపోయాడు. ఎమోషనల్ సందేశం ఇచ్చారు.
దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడైన అర్జున్ 2021 నుండి ముంబై ఇండియాన్స్ లో భాగమయ్యాడు. అయితే కాంపిటీషన్ కారణంగా ఇప్పటివరకూ ఆడే అవకాశం దక్కలేదు. చివరకు నిన్న పోటీలో ఆడే అవకాశాన్ని పొందాడు. తండ్రి సచిన్ కు ఇది ఒక భావోద్వేగ క్షణంగా మారింది. అర్జున్ ఎంట్రీ ఇచ్చిన సందర్భంగా సచిన్ ఎమోషనల్ హార్ట్ టచింగ్ పోస్ట్ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
"అర్జున్ ఈ రోజు నువ్వు క్రికెటర్గా నీ ప్రయాణంలో మరో ముఖ్యమైన అడుగు వేశావు. నీ తండ్రిగా నిన్ను ప్రేమించే ఆట పై మక్కువ ఉన్న వ్యక్తిగా ఆటకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఆటకు నచ్చేలా నువ్వు కొనసాగిస్తావని నాకు తెలుసు" అని ట్వీట్ చేశాడు.
"అర్జున్ ఈ స్థాయికి చేరుకోవడానికి చాలా కష్టపడ్డాడు. నువ్వు దీన్ని కొనసాగిస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఇది ఒక అందమైన ప్రయాణానికి నాంది. ఆల్ ది బెస్ట్!" అని సచిన్ తన రెండో ట్వీట్ లో రాసుకొచ్చాడు.
సచిన్ టెండూల్కర్ అతని కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆడిన మొదటి తండ్రీ కొడుకులుగా నిలిచారు.
సచిన్ 2008లో ఐపీఎల్ మొదటి సీజన్లో ముంబై ఇండియన్స్ తరుఫున అరంగేట్రం చేసాడు. 2013 వరకు జట్టు కోసం ఆడాడు. ఇప్పుడు అర్జున్ కూడా అదే ఫ్రాంచైజీ నుండి తన అరంగేట్రం చేశాడు.
సచిన్ ఆరు ఐపీఎల్ సీజన్లు ఆడాడు అన్నీ ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు. 78 మ్యాచ్లలో 34.84 సగటుతో మొత్తం 2334 పరుగులు చేశాడు. సచిన్ 119.82 స్ట్రైక్ రేట్తో 29 సిక్సర్లు 295 ఫోర్లు కొట్టి 13 అర్ధసెంచరీలు ఒక సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు.
సచిన్ అత్యుత్తమ ప్రదర్శన ఐపీఎల్ 2010లో చోటుచేసుకుంది. ఆ సీజన్ లో 15 మ్యాచ్లలో 47.53 సగటుతో 132.61 స్ట్రైక్ రేట్తో 618 పరుగులు చేశాడు. ఆ సీజన్లో ఐదు అర్ధశతకాలు సాధించాడు. అతని అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు 89*. ఆ సీజన్లో 'ఆరెంజ్ క్యాప్' గెలుచుకున్నాడు. ముంబై ఇండియన్స్ ఆ సీజన్లో రన్నరప్గా నిలిచింది.
What's Your Reaction?