టెట్ అభ్యర్థులకు బిగ్ షాక్! ఓపెన్ స్కూల్ లో చదివితే DSC కి నో ఛాన్స్... టెట్ కు కూడా అనర్హులే

Mar 28, 2024 - 11:59
 0
టెట్ అభ్యర్థులకు బిగ్ షాక్! ఓపెన్ స్కూల్ లో చదివితే DSC కి నో ఛాన్స్... టెట్ కు కూడా అనర్హులే

మనభారత్ న్యూస్, 28 మార్చి 2024, హైదరాబాద్  :- తెలంగాణలో టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌కు నోటిఫికేషన్‌, టీచర్‌ ఎలిజబిలిటీ టెస్ట్‌ నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే.  ఇపుటికే నిరుద్యోగులు పుస్తకాలతో కుస్తీలు పడుతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో రాష్ట సర్కార్‌ బిగ్‌ షాక్‌ ఇచ్చింది. ఓపెన్‌ స్కూల్‌ విధానంలో బీఈడీ కోర్సులు చేసిన వారికి ఉపాధ్యాయ నియామక పరీక్ష రాసే అవకాశం ఉండదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. వీళ్లు గతంలో నిర్వహించిన ట్‌ పరీక్షలో అర్హత సాధించినప్పటికీ డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవడానికి అనుమతి నిరాకరించాలని నిర్ణయించినట్లు సమాచారం. తాజాగా జరిగిన విద్యాశాఖ సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్గయించినట్లు తెలిసింది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వనున్నారు. విద్యాశాఖ తాజా నిర్ణయంతో దాదాపు 25 వేల మంది అభ్యర్దులు డీఎస్సీకి దూరమయ్యే అవకాశం ఉంది. దీంతో అభ్యర్తుల్లో ఆందోళన నెలకొంది. తెలంగాణ ర్యాష్టంలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూల్‌ గతంలో ఇంటర్‌ ఉత్తీర్ణత పొందిన వారికి డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌, డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కింద సర్టిఫికెట్‌ కోర్సులు నిర్వహించింది. వీటిని రెగ్యులర్‌ డీఎడ్‌ కోర్సులతో సమానంగా భావిస్తారిన అప్పట్లో ప్రచారం కూడా చేశారు. దీంతో అనేక మంది ఈ కోర్సులు చేశారు. ఓపెన్‌ స్కూల్‌ అర్హతతో అభ్యర్తులు ఇంతకాలం ర్యాఫ్తంలో నిర్వహించిన టట్‌ పరీక్షలకు పలుమార్లు హాజరయ్యారు కూడా. అట్‌ దరఖాస్తు ఫాంలో అర్హత కాలంలో డీఎడ్‌కు బదులు 'ఇతరులు'అనే కాలంతో వీళ్లు దరఖాస్తు చేసుకునే వాళ్లు. కానీ ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఈ ఏడాది జనవరిలో కీలక తీర్పు వెలువరించింది. రెగ్యులర్‌ డీఎడ్‌తో ఓపెన్‌ డీఎడ్‌ కోర్స్‌ సమానం కాదని స్పష్టం చేసింది. నేషనల్‌ ఓపెన్‌ స్కూల్‌ ఇచ్చే సర్ఫిఫికెట్‌ కేవలం (ఫైవేటు స్కూళ్లలో టీచర్లుగా పనిచేసేందుకు మాత్రమే అర్హత ఉటుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాష విద్యాశాఖ కూడా ఈ తీర్పును అమలు చేయాలని భావిస్తోంది. దీంతో ఈసారి నిర్వహించనున్న ట్‌, డీఎస్సీకి ఇప్పటికే ఓపెన్‌ అభ్యర్తులు ఎవరైనా దరఖాస్తు చేసి ఉంశే, వెరిఫికేషన్‌లో వారదరినీ పక్కన పెట్టాలని యోచిస్తున్నారు. మునుముందు న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకే ఇలా చేయాల్సి వస్తోందని, ఓసెన్‌ డీఎడ్‌ కోర్సులను పరిగణనలోకి తీసుకోబోమని ఓ ఉన్నతాధికారి తెలిపారు. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

admin ManaBharat News